వెరైటీ పార్కింగ్ ఫైన్‌: డబ్బుకు బదులు జామ్ బాటిల్, అలస్కా యూనివర్సిటీ ప్రకటన

పార్కింగ్ ఫైన్‌లు బకాయి పడ్డవారికి అలస్కా విశ్వవిద్యాలయం వెరైటీ శిక్షను వేసింది.పార్కింగ్ ఫీజును చెల్లించని నవంబర్ 8 లోగా పీనట్ బటర్ లేదా జెల్లీ బాటిళ్లను విరాళాలుగా ఇవ్వవచ్చునని వర్సిటీ ప్రకటించింది.

 Verity Parkingfine Alaska University-TeluguStop.com

గత 45 రోజుల వ్యవధిలో జారీ చేసిర రెండు నోటీసులకు స్పందించని వారు ఆలస్య రుసుము కింద పీనట్ బటర్ లేదా జెల్లీ సీసాలను 60 రోజుల్లోగా ఇవ్వాలని తెలిపింది.

ఈ విరాళాలు ఆహారం అవసరమైన విద్యార్ధులకు స్కూల్ ఎమర్జెన్సీ ఫుడ్ క్యాషీ ద్వారా పంపిణీ చేయబడుతుంది.

యూఏఏ కమ్యూనిటీకి క్యాంపస్‌లో ఆహార భద్రతను అందించడమే పీనట్ బటర్ మరియు జెల్లీ డ్రైవ్ యొక్క లక్ష్యమని అలస్కా విశ్వవిద్యాలయం వెల్లడించింది.ఎవరైనా పార్కింగ్ ఫీజులు చెల్లించాలో వారు ఆహారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా స్థానిక సమాజానికి కడుపు నింపిన వారవుతారని వర్సిటీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

Telugu Alaska, Fine Jam Bottle, Jam Bottle, Telugu Nri Ups-

విరాళం ఇచ్చిన మొత్తాన్ని బట్టి పార్కింగ్ ఫీజులు భర్తి చేయబడతాయని.రెండు 16 ఔన్సుల జెల్లీ సీసాలు ఇస్తే 10 డాలర్లు, మూడు సీసాటు ఇస్తే 35 డాలర్లు, ఐదు సీసాలు ఇస్తే 60 డాలర్లకు సమానమని వర్సిటీ తెలిపింది.మూత తీయని నట్ బటర్-అల్మాండ్, జీడిపప్పు, పీనట్ బటర్ లేదా మరేదైనా ఫ్లేవర్ కలిగిన జామ్, జెల్లీ, మార్మాలాడే జామ్‌లను విద్యార్ధులు విరాళంగా ఇవ్వొచ్చని.ఇంట్లో చేసిన ఉత్పత్తులను ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించమని అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube