జగన్ బ్రతికున్నన్ని రోజులు జనం తిడతారన్న వేణుస్వామి.. 2024లో సీఎం అతనేనంటూ?

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి( Astrologer Venuswamy ) జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కు( Punch Prasad ) లక్ష రూపాయల సహాయం చేసి మంచి మనస్సును చాటుకున్నారు.ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్ష రూపాయల సహాయం చేసిన వేణుస్వామి అదే సమయంలో వేర్వేరు విషయాల గురించి, ఏపీ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

 Venuswamy Shocking Comments About Jagan Details, Jagan , Venu Swamy, Astrologer-TeluguStop.com

వేణుస్వామి మాట్లాడుతూ దిల్ రాజు జాతకం వెరైటీగా ఉందని నరేంద్ర మోదీ జాతకం కూడా వెరైటీ జాతకం అని ఆయన అన్నారు.రూపాయి లేకుండా వీళ్లు ఈ స్థాయికి వచ్చారని వేణుస్వామి తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన అభిరామ్, రానాలను పరిశీలిస్తే రానా గొప్ప స్థాయిలో ఉన్నాడని అభిరామ్ కు పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయన చెప్పుకొచ్చారు.ఏపీలో జగన్ జాతకం( CM Jagan ) బాగుందని టాప్1 లో జగన్ టాప్2 లో చంద్రబాబు టాప్3 లో పవన్ ఉంటారని ఆయన తెలిపారు.

Telugu Astrologervenu, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Punch Prasad,

జగన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని వేణుస్వామి అన్నారు.టీడీపీ జనసేన కలుస్తాయా? కలవవా? అనేది నా దృష్టిలో క్వశ్చన్ మార్క్ అని వేణుస్వామి పేర్కొన్నారు.తెలంగాణలో నంబర్1 పొజిషన్ కోసం టీ.

ఆర్.ఎస్, కాంగ్రెస్ కొట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు.కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని ముందే ఊహించానని ఆయన తెలిపారు.

Telugu Astrologervenu, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Punch Prasad,

2019లో జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేకపోయారని వేణుస్వామి పేర్కొన్నారు.బీజేపీకి డౌన్ ఫాల్ మొదలవుతుందని వేణుస్వామి అన్నారు.టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి టఫ్ ఫైట్ ఉంటుందని మిరాకిల్స్ మాత్రం జరగవని పేర్కొన్నారు.

జగన్ జాతకంలో గురువు నీచంలో ఉన్నాడని ఆయన బ్రతికున్నన్ని రోజులు జనం ఆయనను తిడుతూనే ఉంటారని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube