వేణుమాధవ్‌ మృతి వార్తలపై కుటుంబ సభ్యుల స్పందన  

Venumadahavu Family Suffer From Social Media News About Venumadhav Dead-tdp Party Worker,telugu Comedian,venumadahavu Family

తెలుగు ప్రముఖ కమెడియన్‌ వేణుమాధవ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా నిన్న ఉదయం నుండి మీడియాలో వార్తలు వచ్చాయి.సికింద్రాబాద్‌ యశోదా హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.

Venumadahavu Family Suffer From Social Media News About Venumadhav Dead-tdp Party Worker,telugu Comedian,venumadahavu Family Telugu Tollywood Movie Cinema Film Latest News-Venumadahavu Family Suffer From Social Media News About Venumadhav Dead-Tdp Party Worker Telugu Comedian

నిన్న రాత్రి సమయంలో సోషల్‌ మీడియాలో వేణు మాధవ్‌ మృతి అంటూ కూడా వార్తలు వచ్చాయి.వేణు మాధవ్‌ మృతి చెందినట్లుగా ప్రచారం జరగడంతో ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా చర్చనీయాంశం అయ్యింది.

  కమెడియన్‌ వేణుమాధవ్‌ మృతి అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను మృతి చెందినట్లుగా ప్రచారం చేయడం బాధకరం అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Venumadahavu Family Suffer From Social Media News About Venumadhav Dead-tdp Party Worker,telugu Comedian,venumadahavu Family Telugu Tollywood Movie Cinema Film Latest News-Venumadahavu Family Suffer From Social Media News About Venumadhav Dead-Tdp Party Worker Telugu Comedian

మీడియాలో పుకార్లు పుట్టించే వారికి వారు విజ్ఞప్తి చేశారు.చనిపోకున్నా మనిషిని చనిపోయినట్లుగా ప్రచారం చేయవద్దంటూ వారు కోరారు.

వేణుమాదవ్‌ మృతి వార్త పుకార్లే అంటూ తేలడంతో ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకుంటున్నారు.

  సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఉండి మంచి గుర్తింపు దక్కించుకున్న వేణు మాధవ్‌ తెలుగు దేశం పార్టీలో కీలక సభ్యుడిగా కూడా ఉన్నాడు.

పలు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తెలుగు దేశం పార్టీకి మద్దతుగా ఆయన ప్రచారం చేసిన సందర్బాలు ఉన్నాయి.అందుకే తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా వేణు మాధవ్‌ అనారోగ్య వార్తలపై ఆందోళనగా ఉన్నారు.

తాజా వార్తలు