ఆహా కోసం విరాటపర్వం దర్శకుడి కంటెంట్  

Director Venu Udugula, Web Series,OTT, Venu Udugula to direct Web Series, Allu Aravind,Aaha - Telugu Aaha, Allu Aravind, Director Venu Udugula, Ott, Venu Udugula To Direct Web Series, Web Series

కరోనా కారణంగా ఒక్కసారిగా ఓటీటీ క్రేజ్‌ పెరిగింది.ఇండియాలో ఈ నాలుగు నెలల కాలంలో ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది.

 Venu Udugula Web Series

దాంతో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఎక్కువగా ఓన్‌ కంటెంట్‌ కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.తెలుగు నుండి వచ్చిన మొదటి ఓటీటీ అయిన ఆహాను భారీ ఎత్తున జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు అల్లు అరవింద్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకోసం తనకున్న పరిచయాలు ఇంకా అనుభవంతో వెబ్‌ సిరీస్‌లను వరుసగా తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ఆహా కోసం విరాటపర్వం దర్శకుడి కంటెంట్-Movie-Telugu Tollywood Photo Image

పలువురు ప్రముఖ దర్శకులతో వెబ్‌ సిరీస్‌లను అల్లు అరవింద్‌ రూపొందించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.

తాజాగా విరాటపర్వం చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో కూడా ఆహా కోసం అల్లు అరవింద్‌ ఒక వెబ్‌ సిరీస్‌ ను నిర్మిస్తున్నాడట.రానా, సాయి పల్లవిలతో విరాట పర్వం చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసిన దర్శకుడు వేణు ఉడుగు ఆ సినిమా విడుదలకు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల వెబ్‌ సిరీస్‌ దారి పట్టినట్లుగా తెలుస్తోంది.

ట్యాలెంటెడ్‌ రచయితగా దర్శకుడిగా వేణుకు పేరు ఉంది.అందుకే ఆయనతో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి వెబ్‌ సిరీస్‌ ను అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నాడట.ఆహాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ మొదలు అయ్యే అవకాశం ఉందట.మొత్తం 15 ఎపిసోడ్స్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని కూడా సమాచారం అందుతోంది.

మొత్తానికి దర్శకులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ మంచి అవకాశాలను ఇస్తున్నాయి.

#Web Series #Allu Aravind #OTT #Aaha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Venu Udugula Web Series Related Telugu News,Photos/Pics,Images..