సాయి పల్లవి నక్సలైట్ కాదట…  

Venu udugula, Tollywood director, Sai pallavi, Telugu heroine, Virata Parvam movie, - Telugu Sai Pallavi, Telugu Heroine, Tollywood Director, Venu Udugula, Virata Parvam Movie

తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల “విరాట పర్వం” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి, కోలీవుడ్ బ్యూటీ ప్రియమణి, ఫిదా మూవీ ఫేమ్ సాయి పల్లవి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 Venu Udugula Virata Parvam Sai Pallav

అయితే ఇటీవలే ఈ చిత్రంలో సాయి పల్లవి కి సంబందించిన ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.దీంతో ఈ పోస్టర్ ని చూసినటువంటి అభిమానులు ఈ  చిత్రంలో సాయి పల్లవి ప్రజల కోసం పోరాటం చేసేటువంటి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు తెగ చర్చించుకుంటున్నారు.

దీంతో తాజాగా ఈ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల ఈ విషయంపై స్పందించాడు.ఇందులో భాగంగా విరాటపర్వం చిత్రంలో నటి సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించడం లేదని స్పష్టం చేశాడు.

సాయి పల్లవి నక్సలైట్ కాదట…-Latest News-Telugu Tollywood Photo Image

కానీ ఈ చిత్రంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించారని, పోరాట పటిమ కనబరిచేటువంటి సన్నివేశాల్లో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చాడు.అలాగే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మరో 20 శాతం వరకు మాత్రమే మిగిలి ఉందని అది కూడా తొందరలోనే పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తన వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న  “లవ్ స్టోరీ” అనే చిత్రంలో యంగ్ హీరో నాగ చైతన్య సరసన నటిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.

#Sai Pallavi #Venu Udugula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Venu Udugula Virata Parvam Sai Pallav Related Telugu News,Photos/Pics,Images..