ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కూడా ఒకటి.ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Venu Tottempudi Rejected Itlu Sravani Subramanyam Movie Details, Itlu Sravani Su-TeluguStop.com

హనుమాన్ జంక్షన్ ఆ రోజుల్లో 52 సెంటర్లలో 100 రోజులు ఆడిందని వేణు చెప్పుకొచ్చారు.పేర్లకు ముందు ట్యాగ్స్ నాకు పెద్దగా ఇష్టం ఉండదని వేణు తెలిపారు.

సుమంత్ నాతో పాటు కెరీర్ ను మొదలుపెట్టారని వేణు చెప్పుకొచ్చారు.అప్పట్లో బయటి ప్రపంచం నాకు పెద్దగా తెలియదని వేణు తెలిపారు.ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో హీరోగా చేసే అవకాశం తనకు వచ్చిందని నాకు రవితేజకు ఏదో కనెక్షన్ ఉందని వేణు చెప్పుకొచ్చారు.చిరునవ్వుతో సక్సెస్ తర్వాత ఇ.వి.వి సత్యనారాయణ డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పానని వేణు వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పూరీ జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పారని వేణు అన్నారు.

Telugu Ashwini Dutt, Puri Jagannath, Itlusravani, Rama Rao Duty, Raviteja, Venu

ఇ.వి.వి.సత్యనారాయణ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత అని అశ్వనీదత్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఆ తర్వాత ఇ.

వి.వి.సత్యనారాయణ అశ్వనీదత్ కాంబో మూవీ ఆగిపోయిందని వేణు చెప్పుకొచ్చారు.

Telugu Ashwini Dutt, Puri Jagannath, Itlusravani, Rama Rao Duty, Raviteja, Venu

ఈ విధంగా రెండు ప్రాజెక్ట్ లను పోగొట్టుకున్నానని వేణు తెలిపారు.పూరీ జగన్నాథ్ గారికి నేను సారీ చెప్పానని ఆయన వెల్లడించారు.జీవితం ఒకసారి చాలా గమ్మత్తుగా ఉంటుందని వేణు అన్నారు.

ఆ తర్వాత ఇ.వి.వి.సత్యనారాయణ తనతో సినిమా చేస్తానని చెప్పి కథ మార్చారని వేణు చెప్పుకొచ్చారు.ఆ కథనే వీడెక్కడి మొగుడండీ అని వేణు తెలిపారు.వేణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube