బాంబు పేల్చిన వేణు స్వామి.. రకుల్ పెళ్లి క్యాన్సిల్.. ఆమె జాతకమే అది!

Venu Swamy Said Rakuls Wedding Going To Cancel It Is Her Horoscope Details

సినీరంగానికి, రాజకీయ రంగానికి చెందిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో ఓ పెద్ద బాంబు పేల్చాడు.రకుల్ పెళ్లి క్యాన్సిల్ అవుతుందని ఆమె జాతకంలో లోపం ఉందని కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.

 Venu Swamy Said Rakuls Wedding Going To Cancel It Is Her Horoscope Details-TeluguStop.com

గతంలో సమంత, నాగ చైతన్యలు విడిపోతారని స్వయంగా మీడియా ద్వారా తెలుపగా గతంలో ఈయనపై బాగా విమర్శలు చేశారు.

కానీ ఇటీవలే సమంత, నాగ చైతన్య విడిపోవడంతో ఇప్పుడిప్పుడే వేణు స్వామి మాటలు నమ్ముతున్నారు ప్రజలు.

 Venu Swamy Said Rakuls Wedding Going To Cancel It Is Her Horoscope Details-బాంబు పేల్చిన వేణు స్వామి.. రకుల్ పెళ్లి క్యాన్సిల్.. ఆమె జాతకమే అది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయితో బ్రేకప్ అవుతుందని ముందుగానే చెప్పాడు.నిజంగానే ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది.

ఇదిలా ఉంటే తాజాగా రకుల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.రకుల్ పెళ్లి చేసుకున్న తర్వాత తన పెళ్లి జీవితం ఎంతో కాలం నిలవదని కొన్ని న్యాయపరమైన గొడవలు కూడా వస్తాయని గట్టిగా చెప్పాడు వేణు స్వామి.

మరీ రకుల్ ప్రీత్ జాతకంలో ఏముందో అసలేంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

తన గ్లామర్ తో ఎంతో మంది కుర్రాళ్ల మనసులని దోచుకుంది.తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషలలో కూడా నటించింది.తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి కన్నడ సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Telugu Astrologervenu, Canceled, Horoscope, Jail, Jockey Bhagnani, Marrige, Rakul Fiance, Rakul Horoscope, Rakul, Tollywood, Venu Swami-Movie

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలిసారి నటనకు మంచి గుర్తింపు తెచ్చుకోగా వరుసగా వెనుదిరిగి చూడకుండా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.బిజీ లైఫ్ లో ఉండి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇటీవలె రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే.

Telugu Astrologervenu, Canceled, Horoscope, Jail, Jockey Bhagnani, Marrige, Rakul Fiance, Rakul Horoscope, Rakul, Tollywood, Venu Swami-Movie

తన 31 వ పుట్టిన రోజు రోజున బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని తెలిపింది.కొంత కాలం నుండి వీరి మధ్య ప్రేమ నడుస్తుందని త్వరలోనే పెళ్లి తో ఒకటి కానున్నారని బాగా వార్తలు వినిపించాయి.దీంతో ఇటీవలే ఈ విషయం రకుల్ ప్రీత్ బయటపెట్టడంతో ప్రస్తుతం వీరి పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి.

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ జాతకం చూడటానికి రంగంలోకి దిగాడు వేణు స్వామి.

ముందుగా జాకీ జాతకం చూసి అతడిది మకర రాశి అని అతడి జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడు ఉండటంతో పెళ్లి జీవితంలో సమస్యలు ఉన్నాయని తెలిపాడు.ఇక రకుల్ ది మిధున రాశి అని గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం ఉండదని తెలిపాడు.

Telugu Astrologervenu, Canceled, Horoscope, Jail, Jockey Bhagnani, Marrige, Rakul Fiance, Rakul Horoscope, Rakul, Tollywood, Venu Swami-Movie

వీరి నిశ్చితార్థం వరకే ఆగిపోతుందని ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని రోజులకే విడిపోతారని షాకింగ్ కామెంట్ చేశాడు.అంతేకాకుండా రకుల్ ఓ కేసు విషయంలో జైలుకు కూడా వెళుతుందని అనడంతో ప్రస్తుతం వేణు స్వామి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.మరి రకుల్ పెళ్లి జీవితం ఎలా ఉంటుందో అసలు ఈ విషయం తెలియడంతో పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.ప్రస్తుతం మాత్రం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

#Jail #Jockey Bhagnani #Rakul Horoscope #AstrologerVenu #Venu Swami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube