వేణు శ్రీరామ్ మరొక హీరోను వెతుక్కున్నారా..?

వకీల్ సాబ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.పవన్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసినదే.

 Venu Sriram Ready To Movie With Another Star Hero, Venu Sriram, Another Star Her-TeluguStop.com

ఈ సినిమాతో పవన్ మళ్ళీ తన సత్తా నిరూపించుకున్నాడు.ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ చిత్ర టీమ్ పై ప్రశంసలు కురిసాయి.

ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రముఖులు కూడా ఈ సినిమా బాగుందని మంచి సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చావని పవన్ ను అభినందించారు.

ఈ సినిమా హిట్ అవ్వడంతో పవన్ కు మాత్రమే కాదు.

డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు కూడా ప్రశంసలు అందాయి.ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు.

వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయాలనీ అనుకున్నాడు.కానీ పవన్ ఇప్పటికే నాలుగైదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి అవ్వాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది.

వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.

ఈ సినిమాతో దిల్ రాజు కాంపౌండ్ లోకి వేణు శ్రీరామ్ కూడా వచ్చాడు.వేణు శ్రీరామ్ డైరెక్షన్ నచ్చిన దిల్ రాజు తనతో మరొక సినిమాను తీయాలనే ఆలోచనలో ఉన్నాడట.

ఇంతకు ముందు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమాను ఏంనౌన్సు చేసాడు.ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు.

అల్లు అర్జున్ కూడా వేరే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు.

Telugu Alu Arjun, Dil Raju, Project, Pawan Kalyan, Venu Sriram-Movie

అందుకే వేణు శ్రీరామ్ మరొక హీరోను వెతికే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఒక మంచి కథను కూడా రెడీ చేసుకుని ఆ హీరోకు వినిపించే పనిలో ఉన్నాడట శ్రీరామ్.అది కూడా స్టార్ హీరోతోనే సినిమా ఉంటుందని టాక్ నడుస్తుంది.

చూడాలి మరి వేణు శ్రీరామ్ చివరకు ఎవరితో ఓకే చేపించుకుంటాడో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube