వకీల్ సాబ్ సీక్వెల్ కోసం కథ సిద్ధం చేస్తున్న వేణు శ్రీరామ్

పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాకి కరోనా ఎఫెక్ట్ కారణంగా భారీ కలెక్షన్లు రాకున్న నిర్మాత దిల్ రాజుకి మాత్రం లాభాలే తీసుకొచ్చింది.

 Venu Sri Ram Write A Story For Vakeel Saab Sequel, Pawan Kalyan, Dil Raju, Tolly-TeluguStop.com

ఒక తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒటీటీలో కూడా వకీల్ సాబ్ రిలీజ్ అయ్యింది.వేణు శ్రీరామ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని అద్బుతంగా ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా చేశాడు .అమితాబచ్చన్ పింక్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఆ సినిమాలో మెయిన్ స్టొరీ లైన్ తీసుకొని హీరో క్యారెక్టరైజేషన్ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్, యాటిట్యూడ్, స్టైల్ కి తగ్గట్లు మార్చేసి తెరపై ఆవిష్కరించిన విధానం విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని కూడా పెంచే విధంగా సినిమా ఉందనే అభిప్రాయం వినిపించింది.

పొలిటికల్ మైలేజ్ కి కూడా సినిమా కొంత వరకు కలిసి వస్తుందని అనుకున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు వేణు శ్రీ రామ్, దిల్ రాజుతో మరో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ సినిమా తెరపైకి వెళ్ళడానికి కాస్తా ఆలస్యం అయినా వకీల్ సాబ్ తరహాలో సోషల్ కాన్సెప్ట్ తో అలాగే కంటెంపరరీ ఇష్యూ బేస్ చేసుకొని ఉండే విధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు బోగట్టా.దీంతో దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సీక్వెల్ కి తన స్టైల్ లో సొంత కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

వకీల్ సాబ్ లో స్త్రీలపై సమాజంలో జరుగుతున్న వేదింపులపై ఉంటే ఈ సీక్వెల్ కథాంశంలో రైతుల సమస్యలు, గ్రామాల అభివృద్ధి గురించి చర్చించే విధంగా స్టొరీ లైన్ సిద్ధం చేశాడని దీనిని తెలుస్తుంది.దిల్ రాజుతో పటు పవన్ కళ్యాణ్ కి కూడా వినిపించడం జరిగిందని వారు కూడా ఒకే చెప్పారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube