ఒరిజినల్ పింక్ తో సంబంధం లేని వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్... రివీల్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా వకీల్ సాబ్.బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు.

 Venu Sri Ram Reveal Vakeel Saab Flashback Episode, Tollywood, Pawan Kalyan, Srut-TeluguStop.com

అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని కథలో చాలా మార్పులు చేసినట్లు గతంలోనే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.మెయిన్ ఎలిమెంట్ ని అలాగే ఉంచి హీరో క్యారెక్టరైజేషన్ పూర్తిగా చేంజ్ చేసినట్లు పవన్ కళ్యాణ్ స్టిల్స్, టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

ట్రెండింగ్ కాన్సెప్ట్ కావడంతో హీరోయిజం ఎలివేట్ చేసి చెబితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే దిల్ రాజు పింక్ రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కూడా మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కొంత సామాజిక స్పూర్తిని అందించే కంటెంట్ అయితే బెటర్ అని పింక్ రీమేక్ కి ఒకే చెప్పాడు.

ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన వకీల్ సాబ్ ట్రైలర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసింది.

Telugu Dil Raju, Pawan Kalyan, Sruthi Hassan, Tollywood, Vakeel Saab, Vakeelsaab

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ ముందే క్లారిటీ ఇచ్చాడు.ఆ ఎపిసోడ్ లో శృతి హసన్ పాత్ర కూడా ఉంటుందని చెప్పాడు.అయితే ఫ్లాష్ బ్యాక్ ని వేణు శ్రీరామ్ ఎలా సిద్ధం చేసారనే డౌట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో చాలా రోజులుగా ఉంది.ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి రివీల్ చేసాడు.ఫ్లాష్ బ్యాక్ లో విద్యార్ధి నాయకుడుగా కనిపిస్తాడని, న్యాయవిధ్యర్దిగా ఉంటూ స్టూడెంట్స్ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటాడని, ఆ క్రమంలోనే శృతి హసన్ తో లవ్ స్టొరీ కూడా నడుస్తుందని చెప్పుకొచ్చాడు.

ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్కరికి కచ్చితంగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube