తెలంగాణ ఎన్నికల బరిలో హాస్య నటుడు !     2018-11-15   15:10:55  IST  Sai M

తెలంగాణ ఎన్నికల బరిలో వివాద పార్టీల నుంచి చాలామంది ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే… అవకాశం రానివారు రెబెల్స్ గా బరిలో దిగుతున్నారు. మరికొందరు ఏ పార్టీ లోకి వెళ్లలేక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పడు ఆ విధంగానే తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు హాస్యనటుడు వేణుమాధవ్‌ గురువారం ప్రకటించారు.

Venu Madhav Is Contesting In The Telangana Elections-

టిడిపి కార్యకర్తగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వేణుమాధవ్‌ స్వస్థలం కోదాడే. ఇక్కడే ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఈ రోజు ఆయన తన నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం. అయితే వేణుమాధవ్ కు స్థానికంగా మంచి పరిచయాలే ఉన్నా… గెలుపు అవకాశాలు మాత్రం ఉండే అవకాశం కనిపించడంలేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.