లాక్ డౌన్ దెబ్బకి చీపురు పట్టిన టాలీవుడ్ కమెడియన్....  

Vennela Kishore House Cleaning Video Goes Viral - Telugu Tollywood Comedian Vennela Kishore, Tollywood Vennela Kishore, Vennela Kishore, Vennela Kishore House Cleaning Video,

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ కమెడియన్లలో వెన్నెల కిషోర్ ఒకరు.వెన్నెల కిషోర్ కామెడీ పాత్రలే కాకుండా హీరో స్నేహితుడి పాత్రలు, సహాయ నటుడి పాత్రలలో వంటివి కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులని బాగానే మెప్పించాడు.

 Vennela Kishore House Cleaning Video Goes Viral - Telugu Tollywood Comedian

ఇందులో భాగంగా వెన్నెల కిషోర్ అనతికాలంలోనే బాగానే పాపులర్ అయ్యాడు.దీంతో దాదాపుగా టాలీవుడ్ లోని అందరి ప్రముఖ స్టార్ హీరోల చిత్రాల్లో కామెడీ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

అయితే తాజాగా వెన్నెల కిషోర్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో ని షేర్ చేశాడు.ఇందులో  వెన్నెల కిషోర్ చీపురు పట్టి తన ఇంటిని శుభ్రం చేస్తున్నాడు.అంతేగాక ఈ వీడియోకి దమ్ముంటే కాస్కో అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్లో బాగానే వైరల్ అవుతుంది.

 Vennela Kishore House Cleaning Video Goes Viral - Telugu Tollywood Comedian

అంతేగాక కొందరు నెటిజన్లు అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నాడు.మరికొందరు మాత్రం మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అంటూ వెన్నెల కిషోర్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

ఏదేమైనప్పటికీ కరోనా వైరస్ కారణంగా విధించినటువంటి లాక్ డౌన్  కార్యక్రమంతో సోషల్ మీడియాలు ఫుల్ అప్ డేట్లతో నిండిపోతున్నాయి.

అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చిత్ర, సీరియల్ షూటింగ్ లను నిలిపి వేసిన సంగతి తెలిసిందే.దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు తమ కుటుంబాలతో ఇళ్ల కే పరిమితమై సంతోషంగా గడుపుతున్నారు.అలాగే ప్రజలను కూడా ఇంటి నుంచి బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు.

తాజా వార్తలు

Vennela Kishore House Cleaning Video Goes Viral Related Telugu News,Photos/Pics,Images..