వెన్న తింటే ఎన్ని లాభాలో తెలిస్తే వదలకుండా తింటారు       2018-07-02   22:21:03  IST  Lakshmi P

సాధారణంగా ప్రతి ఇంటిలోనూ వెన్న ఉంటుంది. వెన్న తింటే కొలస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది తినటం మానేస్తు ఉంటారు. అయితే దేనినైనా లిమిట్ లో తింటే ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి. వెన్న కూడా అంతే. వెన్నను ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే లిమిట్ లో తింటే మాత్రం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆర్టికల్ చదివిన వారు తప్పనిసరిగా వెన్నను తింటారు. ఇప్పుడు వెన్నను ఎందుకు తినాలో తెలుసుకుందాం.

వెన్నలో రెండు రకాలు ఉంటాయి. అవి ఆవు వెన్న,గేదే వెన్న. వీటిలో ఆవు వెన్న చాలా మంచిది. ఆవు వెన్న శరీరానికి దృఢత్వాన్ని మరియు చలువను కలిగిస్తుంది. అంతేకాక గేదె వెన్న కన్నా ఆవు వెన్న తొందరగా జీర్ణం అవుతుంది.

కడుపులో మంట,గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు వెన్నలో కొంచెం పంచదార కలిపి తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

స్నానం చేసే ముందు శరీరాన్ని వెన్నతో మసాజ్ చేస్తే శరీరం కాంతివంతంగా మృదువుగా మారుతుంది.

వెన్నలో ఎ, బి, సి, డి విటమిన్లు సమృద్ధిగా ఉండుట వలన ఎదిగే పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం అని చెప్పవచ్చు. వెన్నలో ఉండే కొవ్వు సులభంగా జీర్ణం అయ్యి శరీరానికి శక్తిని ఇస్తుంది.

వెన్న తినటం వలన కాలేయం ఆరోగ్యంగా ఉండి వ్యర్ధాలు అన్ని బయటకు పోతాయి. అలాగే మెటబాలిజం చురుగ్గా ఉండి జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది.