వెంకటేష్ మరియు నాగచైతన్య కలిసి నటించిన ‘వెంకీమామ’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన ఈ చిత్రంకు మిశ్రమ స్పందన వచ్చింది.
కొన్ని బ్యాడ్ రివ్యూలు వచ్చాయి.నాగచైతన్య పాత్రకు ప్రాముఖ్యత లేకుండా చేశారంటూ విమర్శలు వచ్చాయి.
అయినా కూడా ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు 7 కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకోవడం అందరిని ఆశ్చర్యంకు గురి చేసింది.సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఈ మల్టీస్టారర్‌ను చూడాలని జనాలు కోరుకున్నారు.అంతా కోరుకున్నట్లుగానే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ను అందించకున్నా కూడా కోట్లు మాత్రం కురిపించింది.
నేడు మరియు రేపు కూడా ఇదే తరహా వసూళ్లు నమోదు అయితే సినిమా సక్సెస్ అయినట్లుగానే భావించవచ్చు.
ఏరియాల వారిగా ఈ చిత్రం కలెక్షన్స్ :
నైజాం : 2.29 కోట్లు
సీడెడ్ : 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర : 87 లక్షలు
ఈస్ట్ : 60 లక్షలు
వెస్ట్ : 30 లక్షలు
కృష్ణ : 37 లక్షలు
గుంటూరు : 72 లక్షలు
నెల్లూరు : 27 లక్షలు
మొత్తం షేర్ : 7.02 కోట్లు
.