'వెంకీమామ' అసలు లోపం ఏంటో తెలిసి పోయింది

వెంకటేష్‌, నాగచైతన్యలు హీరోలుగా రూపొందిన మల్టీస్టారర్‌ మూవీ వెంకీ మామ విడుదల విషయంలో అదుగో ఇదుగో అంటూ వార్తలు వస్తున్నాయి.బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్‌ బాబు నిర్మించిన విషయం తెల్సిందే.

 Venky Mamma Latest Update-TeluguStop.com

షూటింగ్‌ ఎప్పుడో పూర్తి అయ్యిందని, దసరాకే సినిమాను విడుదల చేస్తామంటూ ఆమద్య ప్రచారం చేశారు.కాని సినిమా సంక్రాంతి వరకు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇంత ఆలస్యంకు కారణం ఏంటీ అనే విషయమై సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అంచనాలు వేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈ చిత్రం సరైన డేట్‌ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

కాని అసలు విషయం ఏంటీ అంటే సురేష్‌ బాబు ఈ చిత్రం నిర్మాణం విషయంలో అస్సలు రాజీపడటం లేదట.తమ్ముడు మరియు మేనల్లుడు నటించిన సినిమా అవ్వడం.

ఈ సినిమా తమ బ్యానర్‌కు చాలా ప్రతిష్టాత్మకం అవ్వడం వల్ల సురేష్‌బాబు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఈ కారణంగానే సురేష్‌బాబు వెంకీ మామ విషయంలో హడావుడిగా ఉండటం లేదట.

Telugu Nagachaitanaiah, Suresh Babu, Venkatesh, Venky Mamma-

  వెంకీ మామ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ వర్క్‌ ఉందట.ఆ గ్రాఫిక్స్‌ వర్క్‌ను పూర్తి చేసేందుకు సమయం తీసుకుంటున్నారు.మొదట ఒక కంపెనీకు గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇస్తే వారు సరైన క్వాలిటీతో ఇవ్వలేక పోయారట.దాంతో మళ్లీ గ్రాఫిక్స్‌ వర్క్‌ను చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.వెంకీమామ చిత్రంలో వెంకటేష్‌ పల్లెటూరు వ్యక్తిగా కనిపించబోతున్నాడు.అలాగే నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా పాయల్‌ మరియు రాశిఖన్నాలు నటిస్తున్నారు.సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అంటున్నారు.

మరి సంక్రాంతికి అయినా వస్తుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube