టాలీవుడ్లో తెరకెక్కుతున్న తాజా చిత్రాల్లో ‘వెంకీ మామ’ ప్రత్యేక గుర్తింపు సాధించింది.నిజజీవితంలోనూ మామ అల్లుళ్లు అయిన వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ట్విస్టు ఇదేనంటూ ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో చైతూ ఓ సైనికుడిగా నటిస్తోన్నాడు.ఈ సినిమా క్లైమాక్స్‌లో చైతూ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది.
దీంతో సినిమా ట్రాజెడీ క్లైమాక్స్‌తో ముగుస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి.ఈ సినిమాలో క్లైమాక్స్ ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టించడం ఖాయమని తెలుస్తోంది.
ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది.చైతూ పాత్రను ఎలా ముగిస్తారో అంటూ ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు.ఏదేమైనా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తుండగా డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.