మొన్ననే మొదలైంది అప్పుడే రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది  

Venky Mama Movie Release Date Is Announced-naga Chaitanya,shekar Kammula,venkatesh,venky Mama Movie

‘ఫిదా’ చేసిన శేఖర్‌ కమ్ముల మరియు సాయి పల్లవిలతో కలిసి నాగచైతన్య ఒక చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే.గత వారమే ఈ చిత్రం ప్రారంభం అయ్యింది.మరోసారి ఈ కాంబో ఫిదా చేయడం ఖాయం అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.శేఖర్‌ కమ్ముల చాలా గ్యాప్‌ తీసుకుని చేస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చకచక పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Venky Mama Movie Release Date Is Announced-naga Chaitanya,shekar Kammula,venkatesh,venky Mama Movie-Venky Mama Movie Release Date Is Announced-Naga Chaitanya Shekar Kammula Venkatesh

ఇప్పటికే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించడం జరిగింది.ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.

Venky Mama Movie Release Date Is Announced-naga Chaitanya,shekar Kammula,venkatesh,venky Mama Movie-Venky Mama Movie Release Date Is Announced-Naga Chaitanya Shekar Kammula Venkatesh

ఈ చిత్రం ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కింది.కనుక దీన్ని లవర్స్‌ డే అయిన వ్యాలెంటైన్‌ డే రోజున విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్‌ ఏషియన్‌ సునీల్‌ ఏషియన్‌ సినిమాస్‌పై నిర్మిస్తున్నాడు.నిర్మాతగా ఈయనకు ఇదే మొదటి సినిమా అనే విషయం తెల్సిందే.శేఖర్‌ కమ్ములతో ఈయనకు ఉన్న సన్నిహిత్యంతో ఈ చిత్రంను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

ప్రస్తుతం నాగచైతన్య ‘వెంకీమామ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్నాడు.ఇదే సమయంలో శేఖర్‌ కమ్ముల సినిమాకు ఓక చెప్పడంతో పాటు షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు.నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ చిత్రం ఇంకా శేఖర్‌ కమ్ముల చిత్రాలు కేవలం రెండున్నర మూడు నెలల గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఇది మాత్రమే కాకుండా నాగచైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు చిత్రంలో కూడా నటించాల్సి ఉంది.