వెంకీ మామ అదరగొట్టావ్‌, మరో సక్సెస్‌ ఖాయమేనా?

సంవత్సరం ‘ఎఫ్‌ 2’ చిత్రంతో వెంకీ సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు.చాలా చాలా కాలం తర్వాత వెంకటేష్‌ సక్సెస్‌ దక్కించుకున్నాడు.

 Venky Mama Movie Will Get Success For Venkys-TeluguStop.com

ఈ సక్సెస్‌ జోష్‌లో ఉన్న వెంకీ ప్రస్తుతం వెంకీమామ చిత్రాన్ని చేస్తున్నాడు.తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ఈ సినిమాను మొదలు పెట్టాడు.

గత ఏడాది ఈ సినిమా ప్రారంభం అయినా ఇప్పటి వరకు సినిమా విడుదల చేయలేదు.కారణం ఏదైనా కూడా ఈ సినిమా విడుదల కాకపోవడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

సినిమా ఆలస్యం అయినా కూడా తప్పకుండా సక్సెస్‌ దక్కుతుందనే నమ్మకం మాత్రం వ్యక్తం అవుతుంది.ఇన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న వెంకీ మామ మెల్లమెల్లగా సందడి మొదలు పెట్టాడు.

సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు.ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్‌లు విడుదల చేస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పుడు సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.

Telugu Naga Chaitanya, Telugu Trailer, Tollywood Box, Venky Mama-

వెంకీ మామ చిత్రంలోని ఎన్నాళ్లకో అంటూ సాగే పాటను రేపు విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల నుండి ప్రకటన వచ్చింది.ఈ పాటలో వెంకీ 1970 కాలంలోకి వెళ్లబోతున్నట్లుగా ఫోస్టర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.వెంకీ ఆ లుక్‌లో చాలా బాగున్నాడు.తప్పకుండా ఆకట్టుకుంటాడు అనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు.ఎఫ్‌ 2 చిత్రం తర్వాత వెంకీకి మరో సక్సెస్‌ను ఈ చిత్రం అందిస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube