టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది.ఇక మామ అల్లుడు వెంకటేష్, నాగచైతన్యల సినిమా అనగానే అంచనాలు పీక్స్‌కు చేరాయి.
అంచనాలకు తగ్గట్లుగా సినిమాను తీసేందుకు దర్శకుడు బాబీ చాలా కష్టపడ్డాడు.చాలా సమయం తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాకు నిర్మాత సురేష్ బాబు చాలా ఎక్కువ ఖర్చు చేశాడు.మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
వెంకట సత్యనారాయణ(వెంకటేష్) మరియు కార్తిక్ శివరామ్(నాగచైతన్య)లు మామ అల్లుడు.వీరిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం.ఇద్దరు మామ అల్లుడు అయినా కూడా మంచి స్నేహితులు మాదిరిగా ఉంటారు.ఆర్మీలో కెప్టెన్ అయిన కార్తిక్ శివరామ్ ఒక ఆపరేషన్ నిమిత్తం వెళ్తాడు.అయితే కార్తిక్ శివరామ్ జాగ తెలియకుండా పోతాడు.
అప్పుడు వెంకీమామ రంగంలోకి దిగుతాడు.అప్పుడు ఏం జరుగుతుంది? అసలు కార్తిక్ శివరామ్ గతం ఏంటీ? ఏం అయ్యాడు అనేది సినిమా చూసి తెలుసుకోండి.
నటీనటుల నటన :
వెంకటేష్ మరోసారి తన సత్తా చాటాడు.దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత ఎఫ్ 2 చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకుని ఆ సినిమాలో తన నటన విశ్వరూపంను చూపించిన వెంకటేష్ మళ్లీ ఈ సినిమాతో కూడా తన నటన విశ్వరూపంను చూపించాడు.వెంకీమామ పాత్రకు వెంకటేష్ పూర్తి న్యాయం చేశాడు.నాగచైతన్య పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా పోయింది.వెంకటేష్ ముందు ఈయన తేలిపోయాడు.ఉన్నంతలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా అనిపించాడు.
రాశిఖన్నాకు కూడా పెద్దగా స్కోప్ లేదు.పాయల్ రాజ్ పూత్ కు కూడా పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు.మిగిలిన నటీనటులు కూడా ఒక మోస్తరు నటనతో పర్వాలేదు అనిపించారు.
టెక్నికల్ :
ఈ సినిమాలోని పాటలు ఒక మోస్తరుగానే ఉన్నాయి.అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు.ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.కొన్ని సీన్స్‌లో రొటీన్‌గానే ఉంది.సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అన్నట్లుగా ఉంది.
పల్లెటూరు అందాలను కొత్తగా చూపించడంలో సినిమాటోగ్రఫీ సో సో గానే అనిపించింది.ఇక ఆర్మీ సీన్స్ కాస్త పర్వాలేదు.
పాటల చిత్రీకరణ కూడా యావరేజ్‌గా ఉంది.దర్శకుడు బాబీ కథను మూస పద్దతిలో నడిపించి మెప్పించలేక పోయాడు.
కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంది.నిర్మాణాత్మక విలువుల పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.
విశ్లేషణ :
వెంకీ మామ సినిమాపై అంచనాలు చాలా పెట్టుకున్న వారికి ఈ సినిమా నిరాశ పర్చుతుంది.సినిమాపై అంచనాలు లేకుండా వెళ్లిన వారికి మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది.నాగచైతన్యను అభిమానించే వారికి ఈ సినిమా తీవ్రంగా నిరాశ పర్చుతుంది.ఎందుకంటే ఈ సినిమాలో నాగచైతన్య పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత లేదు.సినిమా మొత్తం కూడా వెంకీమామ షోలా సాగింది.కథనంలో నాగచైతన్య కంటే కూడా అధికంగా వెంకటేష్‌కు స్కోప్ దక్కింది.
దాంతో నాగచైతన్య ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.ఇక హీరోయిన్స్ మరియు ఇతర నటీనటులను కూడా దర్శకుడు బాబీ ఉపయోగించుకోలేక పోయాడు.మొత్తంగా వెంకీమామ సినిమా వెంకటేష్ షో గా మిగిలిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్ నటన,హీరోయిన్స్,కామెడీ సీన్స్.
మైనస్ పాయింట్స్ :
చైతూ పాత్ర ప్రాముఖ్యత లేకపోవడం, సంగీతం,ఎడిటింగ్.
బోటమ్ లైన్ :
వెంకీమామ కేవలం వెంకటేష్ ఫ్యాన్స్ కోసమే.