మామ అల్లుడు మరీ ఎక్కువ ఖర్చు చేయిస్తున్నారా?  

Venky Mama Movie Heavy Budget-

అక్కినేని మరియు దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వెంకీమామ’.చాలా ఏళ్లుగా ఈ చిత్రం గురించి, వీరి కాంబో మూవీ గురించిన చర్చలు జరుగుతున్నాయి.ఎట్టకేలకు సురేష్‌బాబు ఈ చిత్రానిన బాబీ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు.జై లవకుశ చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు ప్రస్తుతం వెంకీ మామను లైన్‌లో పెట్టాడు...

Venky Mama Movie Heavy Budget--Venky Mama Movie Heavy Budget-

భారీ ఎత్తున అంచనాలున్న వెంకీ మామ చిత్రంలో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

వెంకీ మామ బడ్జెట్‌ గురించిన చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతుంది.నిర్మాత సురేష్‌బాబు సినిమా నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

Venky Mama Movie Heavy Budget--Venky Mama Movie Heavy Budget-

పెద్ద బడ్జెట్‌ సినిమాలకు వెళ్లడం లేదు.ఈమద్య అయిదు కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమాలను నిర్మిస్తున్నాడు.అలాంటి ఈయన వెంకీమామ చిత్రం కోసం ఏకంగా 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఆర్మీ నేపథ్యంలోనే సీన్స్‌ కోసం ఎక్కువ ఖర్చు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.

నాగచైతన్య మరియు వెంకటేష్‌ల్లో ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు 50 కోట్ల బడ్జెట్‌ సినిమాను లీడ్‌ చేయలేదు.మరి ఇద్దరు ఉన్నారు కనుక బడ్జెట్‌ రికవరీ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.నిర్మాత సురేష్‌ బాబు తన తమ్ముడు మరియు మేనల్లుడి సినిమా అవ్వడంతో ఈ సినిమాకు అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేశాడనే టాక్‌ కూడా వినిపిస్తుంది.షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న వెంకీమామ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మామ అల్లుడు తెగ ఎంటర్‌టైన్‌ చేయడం ఖాయం అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.