వెంకీని చంపేస్తే సినిమా ఎలా హిట్‌ అయ్యేను బాసూ?  

Venky Mama Latest Update-venkatesh After F2 Doing Venky Mamma Movie,venky Mama

ఎఫ్‌ 2 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సీనియర్‌ హీరో వెంకటేష్‌.ఈయన ప్రస్తుతం తన మేనల్లుడితో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

Venky Mama Latest Update-Venkatesh After F2 Doing Mamma Movie

వెంకటేష్‌ ఈ చిత్రంలో మొదట ఒక పల్లెటూరు వ్యక్తిగా కనిపిస్తాడని వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్మీ మేజర్‌ పాత్రలో వెంకటేష్‌ కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘వెంకీమామ’ చిత్రంలో క్లైమాక్స్‌లో వెంకటేష్‌ చనిపోతాడట.

Venky Mama Latest Update-Venkatesh After F2 Doing Mamma Movie

  తెలుగు ప్రేక్షకులు యాంటీ క్లైమాక్స్‌ను అస్సలు ఒప్పుకోరు.జెర్సీ చిత్రం సూపర్‌ హిట్‌ అన్నారు.కాని యాంటీ క్లైమాక్స్‌ కారణంగా పరిస్థితి ఏమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక గతంలో యాంటీ క్లైమాక్స్‌తో వచ్చిన చిత్రాల పరిస్థితి కూడా మనకు తెల్సిందే.అందుకే ఈ చిత్రంలో వెంకీ పాత్ర చనిపోతుంది అంటే మాత్రం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఒప్పుకోవడం అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

అంతటి సాహసం దర్శకుడు బాబీ చేయక పోవచ్చు.కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వెంకీని అలా చూడటం ఏ ఒక్కరికి ఇష్టం ఉండదు.


  మీడియాలో వస్తున్న పుకార్లపై చిత్రం యూనిట్‌ సభ్యులు స్పందించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.బాబీ గత చిత్రాలను చూసినట్లయితే పవర్‌ చిత్రంలో ఒక రవితేజను చంపేశాడు, ఇక జై లవకుశ చిత్రంలో ఒక ఎన్టీఆర్‌ ను చంపేశాడు.

అందుకే వెంకీమామ చిత్రంలో కూడా వెంకీ పాత్రను బాబీ చంపేసి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు విషయం సినిమా విడుదలైతే కాని తెలియదు.నాగచైతన్య మరియు వెంకటేష్‌లకు జోడీగా ఈ చిత్రంలో రాశిఖన్నా మరియు పాయల్‌ రాజ్‌పూత్‌లు నటిస్తున్నారు.

తాజా వార్తలు