వెంకీ మామ విషయంలో మరీ అతిగా ఆలోచిస్తున్నారనిపిస్తుంది, మీరేమంటారు?

అక్కినేని మరియు దగ్గుబాటి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న కాంబో వెంకటేష్‌ మరియు నాగచైతన్యల మూవీ ఎట్టకేలకు పూర్తి అయ్యింది.వెంకీమామ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు చాలా రోజుల క్రితం పూర్తి అయినా కూడా విడుదల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు.

 Venky Mama Latest Update-TeluguStop.com

నిర్మాత సురేష్‌బాబు ఈ సినిమాను చాలా జాగ్రత్తగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మంచి డేట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.గత మూడు నెలలుగా మంచి డేట్‌ దొరకడం లేదు, రాబోయే మూడు నెలల్లో కూడా మంచి డేట్‌ కనిపించడం లేదట.

Telugu Venkteshnaga, Venky Mama, Venky Mama Pone, Venkymamma-

ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.వెంకీమామ సినిమాను ఏదో ఒక రోజు విడుదల చేస్తే సినిమాలో కంటెంట్‌ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు పోటీగా ఇతర సినిమాలు ఉన్నా కూడా ఆధరిస్తారని, కాని వెంకీమామను ఇలా వాయిదాలు వేస్తూ సినిమాపై ఉన్న క్రేజ్‌ను తగ్గిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంక్రాంతికి పెద్ద సినిమాలున్నా కూడా ఈ సినిమాను కూడా విడుదల చేస్తే తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Telugu Venkteshnaga, Venky Mama, Venky Mama Pone, Venkymamma-

నాగచైతన్య మరియు వెంకటేష్‌ల కాంబోకు మంచి క్రేజ్‌ ఉంది.ఆ క్రేజ్‌ పోకముందే సినిమాను విడుదల చేయాలి.మరీ ఎక్కువ ఆలోచన చేసి సినిమాను ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

సురేష్‌బాబు ఇప్పటికైనా అతిగా ఆలోచించడం మానేసి విడుదలకు ఏర్పాట్లు చేయాలంటూ సూచిస్తున్నారు.వెంకీ మామ విడుదల విషయంలో ఇంకా నిర్మాణ సంస్థ నుండి క్లారిటీ రాలేదు.వచ్చే నెలలో అయినా విడుదలకు సంబంధించిన వార్త వస్తుందా చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube