వెంకీ మామకు పెద్ద దెబ్బ.. దారుణంగా పడిపోయింది!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న తాజా చిత్రం వెంకీ మామ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.

 Venky Mama Gets Shock From Hindi Dubbing Rights-TeluguStop.com

మామా అల్లుళ్లు కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.దీనికి తగ్గట్టుగానే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్లు ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కాగా ఈ సినిమాకు హిందీ డబ్బింగ్ విషయంలో గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ జనాలకోసం హిందీలో డబ్బింగ్ చేసి వదిలేందుకు నిర్మాత సురేష్ బాబు రెడీ అయ్యారు.

కానీ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్‌ల దగ్గర్నుండి ఈ సినిమాకు అనుకోని దెబ్బ తగిలింది.హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో వెంకీ మామ సినిమాను ఏకంగా 40 శాతం తక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేశారు బయ్యర్లు.

భారీ అంచనాలు పెట్టుకున్న సురేష్ బాబుకు ఈ చిత్ర రైట్స్ గట్టి దెబ్బను మిగిల్చింది.పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై బాలీవుడ్ జనాల్లో ఆసక్తిని తగ్గించేందుకే బయ్యర్లు ప్రయత్నిస్తున్నారంటూ చిత్ర యూనిట్ మండిపడుతోంది.

అయితే ఇదే పరిస్థితి ఇతర పెద్ద సినిమాలకు కూడా ఏర్పడింది.మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో పోల్చుకుంటే సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ తక్కువ ధరకు రావడమే దీనికి ఉదాహరణగా నిలిచిందని సినీ నిపుణులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube