ఆ దర్శకుడి చిత్రం చూడడం వల్లే దర్శకుడవ్వాలనుకున్నా: వెంకీ కుడుముల 

2003 సంవత్సరంలో టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టువంటి “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రంలో  టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించగా కోలీవుడ్ బ్యూటీ అసిన్ హీరోయిన్ గా నటించింది.

 Venky Kudumula, Director Puri Jagannadh,  Sensational Comments, Tollywood, Bhees-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన  ఓ ఆసక్తికర అంశాలను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల తన అభిమానులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తాను చదువుకునే రోజుల్లో సినిమాలు బాగానే చూస్తూ ఉండేవాడినని, అలాగే దర్శకత్వం వైపు ఆసక్తి ఉన్నప్పటికీ ఎప్పుడూ దర్శకుడిని కావాలని అనుకోలేదని చెప్పుకొచ్చాడు.

కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” చిత్రం చూసిన తర్వాత తాను కచ్చితంగా దర్శకుడిని కావాలని బలంగా నిర్ణయించుకున్నాడట. ఆ తరువాత పూరి జగన్నాథ్ చిత్రాలను చూస్తూ దర్శకత్వం వైపు అడుగులు వేస్తూ పలు మెళుకువలను కూడా నేర్చుకున్నానని తెలిపాడు.

మామూలుగా పూరి జగన్నాథ్ చిత్రాలు నచ్చని వారు ఉండరు. కానీ ఓ యువకుడిని ఏకంగా దర్శకుడిగా మార్చే అంతగా పూరి జగన్నాథ్ చిత్రాలు ప్రభావితం చేశాయాంటే అది సామాన్య విషయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా  ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.చిత్రం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్న ట్లు సమాచారం.

అయితే వెంకీ కుడుముల కూడా ఇటీవలే భీష్మ అనే చిత్రంతో హిట్ కొట్టాడు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడు.

గతంలో వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన టువంటి చలో, భీష్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో తన తదుపరి చిత్రం తో హిట్ కొట్టి హ్యాట్రిక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube