చిరంజీవి హీరోగా ఆ యంగ్‌ డైరెక్టర్‌ తో సినిమా ఉన్నట్లా? లేనట్టా?

Venky Kudumula Movie With Chiranjeevi Almost Stopped , Venky Kudumula , Chiranjeevi, Tollywood , Acharya, Nithiin, Rashmika Mandanna

మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు.అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం లో కూడా ఒక సినిమా ను చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

 Venky Kudumula Movie With Chiranjeevi Almost Stopped , Venky Kudumula , Chiranj-TeluguStop.com

విభిన్నమైన కథ తో వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే చిరంజీవి ఆచార్య సినిమా తో డిజాస్టర్ ఫ్లాప్ అందుకోవడంతో ప్రయోగాలు చేయడానికి భయపడుతున్నాడు.

అందుకే వెంకీ కుడుముల దర్శకత్వం లో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Acharya, Chiranjeevi, Nithiin, Tollywood, Venky Kudumula-Movie

ఈ సమయం లోనే చిరంజీవి తో కాకుండా యంగ్ హీరో నితిన్ తో వెంకీ కుడుముల సినిమా ప్రారంభం కాబోతుందని వార్తలు వచ్చాయి.హీరోయిన్ గా రష్మిక మందనా నటించబోతుందని కూడా ప్రచారం జరిగింది.నితిన్, రష్మిక మందనా, వెంకీ కుడుముల కాంబినేషన్ లో గతం లో భీష్మ సినిమా వచ్చింది.

Telugu Acharya, Chiranjeevi, Nithiin, Tollywood, Venky Kudumula-Movie

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో మరో సారి వీరు ముగ్గురు కలిసి సినిమా చేయబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా నితిన్ కి సరిపోయే ఒక మంచి మాస్ కమర్షియల్ కథ ను ఇప్పటికే వెంకీ కుడుముల రెడీ చేశాడని ప్రచారం జరుగుతుంది.మరో వైపు చిరంజీవి కోసం రెడీ చేసిన కథతో దర్శకుడు వెంకీ కుడుముల ప్రస్తుతం నితిన్ హీరో గా సినిమా ని చేయబోతున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి తో వెంకీ కుడుముల సినిమా భవిష్యత్తులో అయినా ఉంటుందా లేదా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

నితిన్ తో చేయబోతున్న సినిమా సూపర్ హిట్ అయితే కచ్చితంగా చిరంజీవి పిలిచి మళ్లీ వెంకీ కుడుములకు ఆఫర్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube