హీరోగా వెంకీ కొడుకు ఎంట్రీ.. లీకైనా అసలు మ్యాటర్!

సాధారణంగా ఏ రంగంలోనైనా తమ తల్లిదండ్రులు పయనించే బాటలోనే పిల్లలను కూడా తీసుకురావాలని భావిస్తారు.ఈ క్రమంలోనే సినిమారంగంలో కూడా ఎంతో మంది స్టార్ హీరోలు తమ వారసత్వంగా తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

 Venkis Son Entry As A Hero Leaked Real Matter-TeluguStop.com

కేవలం హీరోలు మాత్రమే కాకుండా సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇప్పటికే ఎంతో మంది తమ వారసత్వాన్ని పుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ కుమారుడు అర్జున్ కూడా సినిమాలలోకి రాబోతున్నాడనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ లేదు.ఈ క్రమంలోనే వెంకటేష్ పర్సనల్ మేకప్ మెన్ హీరో వెంకటేష్ కొడుకు ఎంట్రీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Venkis Son Entry As A Hero Leaked Real Matter-హీరోగా వెంకీ కొడుకు ఎంట్రీ.. లీకైనా అసలు మ్యాటర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా విక్టరీ వెంకటేష్ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ ఈ చిత్రాన్ని తెలుగులో నారప్ప గా రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో వెంకటేష్ అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్లను, ఇతర సిబ్బందిని పలు చానల్స్ ఇంటర్వ్యూ చేశాయి.ఈ మేరకు వెంకటేష్ పర్సనల్ మేకప్ మెన్ రాఘవ అనే వ్యక్తితో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూ లో భాగంగా రాఘవ వెంకటేష్ కొడుకు అర్జున్ సినిమా ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.అర్జున్ అందరి మాదిరిగా కాకుండా ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సన్ అని, ఎప్పుడు చూసిన అర్జున్ చేతిలో పుస్తకాలు కనిపిస్తాయంటూ రాఘవ తెలియజేశారు.

సాధారణంగా హీరోల పిల్లలకు నటనపై ఆసక్తి ఉంటే వారి కోసం ఇప్పటికీ ఒక డెబ్యూ మూవీస్ సిద్ధం చేసి పెట్టేవారు.కానీ అర్జున్ విషయంలో అలాకాదు.అతనికి సినిమా రంగంపై ఆసక్తి ఉంటే ఈపాటికే డెబ్యూ సినిమా చేసి ఉండాలని, కానీ అర్జున్ కు ఆసక్తి లేనట్టు తనకనిపిస్తుందని తెలిపారు.ఒకవేళ చదువుపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి చేసిన తర్వాత ఈ రంగంలోకి దృష్టి పెట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా హీరో వెంకటేష్ కొడుకు అర్జున్ సినీ ఎంట్రీ గురించి తెలియజేశారు

.

#Ppa #Venkatesh #Arjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు