‘మోసగాళ్లు’ కు గాత్ర దానం చేయబోతున్న వెంకీ మామ…?!  

Victory Venkatesh Voice Over to Mosagallu movie, Victory Venkatesh, Mosagallu movie, Sunil Shetty, Manchu Vishnu, Kajal Aggarwal, IT Scam, Mosagallu Trailer - Telugu It Scam, Kajal Aggarwal, Manchu Vishnu, Mosagallu Movie, Mosagallu Trailer, Sunil Shetty, Victory Venkatesh, Victory Venkatesh Voice Over To Mosagallu Movie

చాలా రోజుల తర్వాత మంచు వారి కుటుంబం నుంచి మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా మోసగాళ్లు.ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

TeluguStop.com - Venkatesh Voice Over To Mosagallu Movie

ఇందులో హీరో మంచు విష్ణు, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ప్రపంచంలోనే అతి పెద్దదైన ఐటీ స్కాం ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించబోతున్నారు.ఈ సినిమాకి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గి చిన్ తెరకెక్కిస్తున్నారు.

TeluguStop.com - మోసగాళ్లు’ కు గాత్ర దానం చేయబోతున్న వెంకీ మామ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మంచు విష్ణు సోదరిగా నటించబోతోంది.ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడూ లేనంత రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిసింది.

అదేమిటంటే.

ఈ సినిమాకు సంబంధించి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి.

ఈ సినిమా ఆద్యంతం విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించి సినిమా బృందం విక్టరీ వెంకటేష్ ను మొదటగా సంప్రదించగా అందుకు విక్టరీ వెంకటేష్ వెంటనే అంగీకరించినట్లు సమాచారం.

ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్ వాయిస్ చాలా ప్లస్ పాయింట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.తెలుగులో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా ఒకేసారి తెరకెక్కబోతోంది.

అంతేకాదు దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళ్, కన్నడ, మలయాళం భాషలతో పాటు దేశవ్యాప్తంగా హిందీ భాషలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ పరిశ్రమకు బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి మొట్టమొదటిసారిగా పరిచయం కాబోతున్నారు.

#IT Scam #Sunil Shetty #Manchu Vishnu #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Venkatesh Voice Over To Mosagallu Movie Related Telugu News,Photos/Pics,Images..