'ఎఫ్ 3' క్లోజింగ్ కలెక్షన్స్.. ఈ 40 రోజుల్లో వరల్డ్ వైడ్ ఎంత రాబట్టిందంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా ఎఫ్ 3.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లకు జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు.

 Venkatesh-varun Tej Starrer F3 Box Office Closing Collections , Tamanna, Mehreen-TeluguStop.com

అలాగే అదనపు ఆకర్షణగా అనిల్ సోనాల్ చౌహన్, పూజా హెగ్డే ను కూడా అనిల్ రంగంలోకి దింపాడు.

ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా వచ్చింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఈ రోజుతో ఎఫ్ 3 సినిమా రిలీజ్ అయ్యి 40 రోజులు అవుతుంది.

ఎఫ్ 3 అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్స్ కు రప్పించడంతో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమా ఈ 40 రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించి క్లోజ్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం.ఈ సినిమా నైజాం లో 20.57 కోట్లు, ఈస్ట్ లో 4.18 కోట్లు, వెస్ట్ లో 3.41 కోట్లు, కృష్ణ లో 3.23 కోట్లు, గుంటూరు లో 4.18 కోట్లు, నెల్లూరు లో 2.31 కోట్లు, సీడెడ్ లో 8.58 కోట్లు , యూఏ లో 7.48 కోట్లు, కర్ణాటక లో 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా లో 2 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్లు రాబట్టింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 53.94 కోట్లు రాబట్టగా.వరల్డ్ వైడ్ గా 70.94 కోట్ల షేర్ తో 134 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Telugu Anil Ravipudi, Box, Mehreen, Tamanna, Varun Tej, Venkatesh, Venkateshvaru

ఇక థియేటర్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద అలరించడానికి సిద్ధం అయ్యింది.ఈ సినిమా జులై 22 నుండి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది.మరి ఓటిటి లో ఎంత రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube