విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'ఎఫ్ 3' షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమా రాబోతోంది.

 Venkatesh Varun Tej Multistarrer F 3 Movie Shooting Resumes In Hyderabad 3-TeluguStop.com

ఇప్పటికే శర వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళిక వేసింది.

ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.

 Venkatesh Varun Tej Multistarrer F 3 Movie Shooting Resumes In Hyderabad 3-విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎఫ్ 3’ షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా సినిమాకి త‌న గ్రాఫ్‌ని పెంచుకుంటూ సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌బాబు `సరిలేరు నీకెవ్వరు`తో కలెక్షన్ల వర్షం కురిపించారు అనిల్ రావిపూడి.ఇక ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి.

ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు.టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మ‌రియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వ‌రస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు.

సీనియర్ మరియు యంగ్ హీరో కలిసి F2తో అందించిన వినోదం ప్రేక్షకుల‌హృద‌యాల్లో ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంది.

ఈ చిత్రం మీదున్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు.తమన్నా, మెహ్రీన్‌లు వెంకటేష్, వరుణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు.మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది.

ఎఫ్ 2 సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే.ప్రస్తుతం అంతకు మించి అనేలా.ఎఫ్ 3 కోసం స్పెషల్ ట్యూన్లను దేవీ శ్రీ ప్రసాద్ సిద్దం చేశారు.

సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: అనిల్ రావిపూడి సమర్పణ: దిల్ రాజు నిర్మాత: శిరీష్ బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ కెమెరామెన్: సాయి శ్రీరామ్ ఆర్ట్: ఏఎస్ ప్రకాష్ ఎడిటింగ్: తమ్మిరాజు స్క్రిప్ట్ కో ఆర్డినేటర్స్: ఎస్ కృష్ణ అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

.

#Tamanna #Multirer #Venkatesh #Varun Tej #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు