'ఎఫ్‌3' వాయిదా పుకార్లే... దిల్‌ రాజు టీం నుండి క్లారిటీ

ఎఫ్ 2 సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది.కేవలం పాతిక కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఆ సినిమా కేవలం థియేట్రికల్‌ వసూళ్లతోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

 Venkatesh Varun Tej F3 Movie Release Date Postpone News Clarity , Anil Ravipud-TeluguStop.com

ఆ తర్వాత ఇతర బిజినెస్ లతో మరో పాతిక ముప్పై కోట్ల వరకు రాబట్టినట్లుగా తెలుస్తోంది.అంతటి భారీ వసూళ్లు లాభాలు దక్కించుకున్న ఎఫ్‌ 2 సినిమా కు సీక్వెల్‌ అన్నట్లుగా ఎఫ్ 3 సినిమా రూపొందింది.

ఈనెల 27 వ తారీకున విడుదలకు సిద్దం అయ్యింది.సినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో దాదాపుగా వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా విడుదల రెండు రోజులు ఉంది అనగా విడుదల విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సినిమా ను వాయిదా వేయబోతున్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

అందుకు కారణం ఏంటీ అంటే సినిమా విడుదల కు ముందు గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం ఉంది.అక్కడ కొత్త జిల్లా పేరు విషయం లో గందరగోళం నెలకొంది.

దాంతో అక్కడ సినిమా ఆడే పరిస్థితి లేదు.అక్కడ మళ్లీ సాదారణ పరిస్థితులు ఏర్పాడాలి అంటే ఖచ్చితంగా రెండు వారాల సమయం పడుతుంది.

అప్పటి వరకు సినిమా విడుదల అయ్యేది కష్టమే.అందుకే ఎఫ్ 3 సినిమా అక్కడ విడుల చేయలేం కనుక మొత్తం వాయిదా వేస్తే బాగుంటుంది అని దిల్‌ రాజు భావిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

కాని అసలు విషయం ఏంటీ అంటే అసలు ఎఫ్ 3 సినిమా వాయిదా అనేది ఖచ్చితంగా అబద్దపు వార్త.కేవలం అది పుకారు మాత్రమే.

అసలు ఎఫ్ 3 సినిమా అనేది వాయిదా గురించి ఆలోచనే లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube