ఎఫ్3 సినిమాకు ప్లస్, మైనస్ లు ఇవే.. అనిల్ అదే పొరపాటు చేస్తున్నాడంటూ?

వెంకటేష్, వరుణ్ తేజ్ అభిమానులు గత కొంతకాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎఫ్3 సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఎఫ్3 సినిమా ఎంతగానో నచ్చుతుందని ఈ సినిమాను థియేటర్లలో చూసిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 Venkatesh Varun Tej F3 Movie Plus Minus Details, F3 Movie, Venkatesh, Varun Tej,-TeluguStop.com

అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాలో ఎఫ్2 స్థాయిలో ఫన్ లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నెగిటివ్ టాక్ రాకపోవడం ఈ సినిమాకు ఒకింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

మనీ ఫ్రస్టేషన్ ఆధారంగా ఎఫ్3 సినిమా తెరకెక్కగా సినిమాలో అందరి నటన ఆకట్టుకుంది.కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించకపోయినా సినిమాలోని చాలా సన్నివేశాలు కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

నిర్మాణ విలువలు, ఫస్టాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు, వెంకీ వరుణ్ అలీ సునీల్ నటన, దేవిశ్రీ మ్యూజిక్ సినిమాకు ప్లస్ గా నిలిచాయి.

అయితే మరీ కొత్త కథ కాకపోవడం సినిమాలోని కొన్ని సన్నివేశాలు గతంలో చూసిన సినిమాలను గుర్తుకు తెస్తుండటం భారీ అంచనాలతో వెళితే మాత్రం నిరాశపరిచేలా సినిమా ఉండటం సినిమాకు మైనస్ అవుతోంది.

Telugu Dil Raju, Anil Ravipudi, Minuses, Mehreen, Sonal Chouhan, Tamannah, Varun

దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలలో ఫస్టాఫ్ ను అద్భుతంగా తెరకెక్కిస్తూ సెకండాఫ్ విషయంలో తడబడుతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎఫ్3 సినిమా విషయంలో కూడా అదే రిపీట్ కావడం గమనార్హం.

అనిల్ రావిపూడి సెకండాఫ్ పై మరింత దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా రేంజ్ పెరిగేదని చెప్పవచ్చు.

Telugu Dil Raju, Anil Ravipudi, Minuses, Mehreen, Sonal Chouhan, Tamannah, Varun

సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కొన్ని సన్నివేశాలు ఉండటం సినిమాకు ప్లస్ అవుతుంది.థియేటర్ లో ఆ సీన్లను చూసిన సమయంలో ప్రేక్షకులు సర్ప్రైజ్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఈ సినిమాతో లాభాలు గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube