ఇప్పట్లో లేదని చెబుతున్న వెంకటేష్  

Venkatesh To Start F2 Sequel Next Year - Telugu Anil Ravipudi, F2, F3, Sequel, Venkatesh

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించడంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

 Venkatesh To Start F2 Sequel Next Year

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి గతంలోనే చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో ఎఫ్2 సీక్వెల్ కథను రెడీ పూర్తి చేశాడట.

ఇప్పట్లో లేదని చెబుతున్న వెంకటేష్-Gossips-Telugu Tollywood Photo Image

అయితే లాక్‌డౌన్ ముగిసిన తరువాత సినిమా షూటింగ్‌లను చాలా తక్కువ మందితో తెరకెక్కించాలని ప్రభుత్వం ఆదేశించింది.దీంతో తమ సినిమాలు పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుందని, ఈ లెక్కన ఎఫ్3 చిత్ర షూటింగ్ మొదలయ్యేసరికి చాలా సమయం పట్టేటట్లుందని వెంకీ అనడంతో వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది మొదలుపెడతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

అటు వెంకటేష్ ప్రస్తుతం నారప్ప చిత్రంలో నటిస్తుండగా వరుణ్ తేజ్ బాక్సర్ చిత్రంలో నటిస్తున్నాడు.

అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టడంతో మరి ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాలో మరో హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Venkatesh To Start F2 Sequel Next Year Related Telugu News,Photos/Pics,Images..

footer-test