కొరియన్ సినిమాతో వస్తానంటోన్న నారప్ప- Venkatesh To Remake Korean Movie

Venkatesh To Remake Korean Movie, Venkatesh, Naarappa, Korean Movie, Lucky Key, Tollywood News - Telugu Korean Movie, Lucky Key, Naarappa, Tollywood News, Venkatesh

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Venkatesh To Remake Korean Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా నారప్ప చిత్రం తరువాత వెంకీ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి రూపంలో సమాధానం దొరికింది.

 Venkatesh To Remake Korean Movie-కొరియన్ సినిమాతో వస్తానంటోన్న నారప్ప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో వెంకీతో కలిసి మల్టీస్టారర్ మూవీగా ఎఫ్2 చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత వెంకీ మరోసారి రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

కొరియన్ భాషలో సూపర్ హిట్ అయిన ‘లక్కీ కీ’ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రెడీ అవుతుంది.

ఇప్పటికే ఆ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన సురేష్ ప్రొడక్షన్స్, త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తుంది.అయితే ఈ సినిమాలో హీరో ఎవరనే అంశంపై మాత్రం ఇంకా నిర్మాత క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో సురేష్ ప్రొడక్షన్స్‌లో వెంకీ నెక్ట్స్ మూవీ ఉండనుండటంతో, ‘లక్కీ కీ’ సినిమా రీమేక్‌లో ఆయన ఖచ్చితంగా నటిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

#Naarappa #Venkatesh #Lucky Key

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు