రేర్ ఫీట్‌కు సిద్ధం.. 653 లెక్క చెప్పిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తో్న్న లేటెస్ట్ మూవీ ‘వెంకీ మామ’ డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాతో రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్‌పై కూడా తమ సత్తా చాటడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

 Venkatesh To Cut 653 Cakes On Birthday-TeluguStop.com

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామ సినిమా రిలీజ్ సందర్భంగా ఓ రేర్ ఫీట్‌కు వెంకటేష్ ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ రెడీ అయ్యారు.

డిసెంబర్ 13న వెంకటేష్ తన 59వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

ఈ సందర్భంగా వెంకీ మామ ఫ్యాన్స్ 653 స్క్రీన్స్‌లో 653 కేకులు కట్ చేయడానికి సిద్ధమయ్యారు.స్క్రీన్‌కు ఒక కేక్ చొప్పున 653 కేకులు కట్ చేయించేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

సాధారణంగా పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవడం ఇష్టంలేని వెంకటేష్, వెంకీ మామ ప్రమోషన్స్ కోసమే ఈ వేడుకలకు సిద్ధమవుతున్నారు.

ఇక వెంకీ మామ సినిమాలో నాగచైతన్యతో పాటు రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా థమన్ సంగీతం అందించారు.ఈ సినిమాపై వెంకీ మామతో పాటు చిత్ర యూనిట్ కూడా పూర్తి నమ్మకంగా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube