ఎవరైనా డైలాగ్ తప్పుగా చెబితే వెంకటేష్ అలా చేస్తారా.. షాకింగ్ విషయాలు రివీల్!

విక్టరీ వెంకటేష్ కు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.వెంకటేష్ నటించిన ఎఫ్3 సినిమా మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఎఫ్3, ఎఫ్2 సినిమాలలో కమెడియన్ రోల్ లో నటించిన ప్రదీప్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఎఫ్2 సినిమాలోని రోల్ వెనుక ఆసక్తికర విషయాలను ప్రదీప్ చెప్పుకొచ్చారు.

 Venkatesh Revealed Shocking Facts Details Here Goes Viral , Pradeep, F3, F2, Anil Ravipudi, Victory Venkatesh, Varun Tej-TeluguStop.com

అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమాలో రోల్ ఇస్తున్నానని చెప్పిన సమయంలో నేను చాలా సంతోషించానని ఆయన చెప్పుకొచ్చారు.అనిల్ రావిపూడి ఒకటే డైలాగ్ ఉంటుందని చెప్పారని ప్రదీప్ అన్నారు.నాకు కామెడీ అంటే ఇష్టమని ఆయన అన్నారు.ఎఫ్2 సినిమాలో రోల్ వేస్తే పర్సనల్ ఇమేజ్ పై ఎఫెక్ట్ పడుతుందా అని భయపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.ప్రేక్షకుడు మీలో తనను తాను చూడాలని తాను అనుకున్నానని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారని ప్రదీప్ చెప్పారు.

ప్రతి ఇంట్లో ప్రతి భర్త ఒకసారైనా అంతేగా అంతేగా అని అంటారని ప్రదీప్ అన్నారు.అంతేగా అంతేగా డైలాగ్ పాత్ర తాను చేశానని మిగతా వాళ్లు తనను వెక్కిరించారని ఆయన చెప్పుకొచ్చారు.ఎఫ్3 సినిమాలో రోల్ ఎఫ్2 కంటే ఎక్కువ ఉంటుందని ఆయన తెలిపారు.సినిమాగా ఎఫ్3 అంటే నాకు ఇష్టమని ఆయన అన్నారు.ఎఫ్2 కు మించి ఎఫ్3 కచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

 Venkatesh Revealed Shocking Facts Details Here Goes Viral , Pradeep, F3, F2, Anil Ravipudi, Victory Venkatesh, Varun Tej-ఎవరైనా డైలాగ్ తప్పుగా చెబితే వెంకటేష్ అలా చేస్తారా.. షాకింగ్ విషయాలు రివీల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Anil Ravipudi, Pradeep, Varun Tej-Movie

వెంకటేష్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని ఎవరికీ అందని ఫిలాసపీ వెంకటేష్ దగ్గర ఉందని ఆయన తెలిపారు.వెంకటేష్ ఇగో చూపించరని ప్రదీప్ అన్నారు.ఎఫ్3 సినిమాలో టోటల్ ఫైనాన్స్ గురించి ఉంటుందని ప్రదీప్ చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరికీ కామెడీ అంటే ఇష్టమని ఆయన అన్నారు.

వెంకటేష్ తో డైలాగ్ చెబుతున్న సమయంలో డైలాగ్ మరిచిపోతే వెరైటీ భాషను మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube