వెంకటేష్‌, రవితేజ ఏదో జరుగబోతుంది  

Venkatesh And Ravi Teja Something Is Going To Happen-f3,ravi Teja,varun Tej,venkatesh,రవితేజ,వెంకటేష్‌

గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్‌ 2’ చిత్రం సూపర్‌ హిట్‌ దక్కించుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా సక్సెస్‌తో దర్శకుడు అనీల్‌ రావిపూడి ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబును డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ దక్కించుకున్నాడు.

Venkatesh And Ravi Teja Something Is Going To Happen-F3 Ravi Varun Tej Venkatesh రవితేజ వెంకటేష్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తో సరిలేరు నీకెవ్వరు చిత్రంను తెరకెక్కించిన అనీల్‌ రావిపూడి మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యావరేజ్‌ టాక్‌తో సరిలేరు నీకెవ్వరు చిత్రం నిలిచింది.ఇక అనీల్‌ రావిపూడి తదుపరి చిత్రం గురించి అప్పుడే చర్చ మొదలైంది.

ఎఫ్‌ 2 చిత్రం సమయంలోనే దానికి సీక్వెల్‌ తీస్తానంటూ అనీల్‌ రావిపూడి ప్రకటించాడు.

అదే తన తదుపరి చిత్రంగా తాజాగా అనీల్‌ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.ఎఫ్‌ 2 సీక్వెల్‌గా ఎఫ్‌ 3 అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని అనీల్‌ రావిపూడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను వేసవిలో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ఎఫ్‌ 2 చిత్రంలో వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌లు కలిసి నటించారు.

ఎఫ్‌ 3లో మాత్రం వరుణ్‌ ఉండబోడని తెలుస్తోంది.

ఎఫ్‌ 3 చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ప్లేస్‌లో రవితేజ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా చిత్రం విడుదల ఏర్పాట్లలో ఉన్నాడు.ఆ తర్వాత మరో సినిమాను కూడా ఇప్పటికే చేస్తున్నాడు.

ఆ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయబోతున్నాడు.ఆ తర్వాత ఎఫ్‌ 3 చిత్రంలో అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది.

ఇక వెంకటేష్‌ నారప్ప చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా సమ్మర్‌ వరకు పూర్తి చేయాలని వెంకీ భావిస్తున్నాడు.

సమ్మర్‌ వరకు హీరోలు ఫ్రీ అవ్వబోతున్నారు.అప్పటి వరకు అనీల్‌ రావిపూడి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు

Venkatesh And Ravi Teja Something Is Going To Happen-f3,ravi Teja,varun Tej,venkatesh,రవితేజ,వెంకటేష్‌ Related....