తరుణ్ భాస్కర్ కోసం లెక్చరర్ గా మారబోతున్న వెంకటేష్

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి వెంకటేష్ ఇప్పుడు తన వయస్సుకి సరిపోయే పాత్రలు చేస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఎక్కువగా హీరోయిన్స్ తో డ్యూయెట్ కల్చర్ ని పూర్తిగా పక్కన పెట్టేశాడు.

 Venkatesh Play Lecturer Role In Tarun Bhaskar Movie, Tollywood, Telugu Cinema, S-TeluguStop.com

మెచ్యూరిటీ ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.అలాంటి సినిమాలతోనే హిట్స్ కొడుతున్నాడు.

చివరిగా వెంకటేష్ గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం నారప్ప సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయినా రాచ్చసన్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఓ విధంగా చెప్పాలంటే ఇందులో కమర్షియల్ హంగులు అస్సలు ఉండవు.వెంకటేష్ పాత్ర వయస్సు మళ్ళిన ఓ వెనుకబడిన కులస్థుడుగా ఉంటుంది.

దానికి తగ్గట్లే అతని ఆహార్యం ఉంది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ సినిమా చేయబోతున్నాడు.పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తరుణ్ భాస్కర్ చాలా రోజుల నుంచి వెంకటేష్ సినిమా మీదనే వర్క్ చేస్తున్నాడు.పెర్ఫెక్షన్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉన్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.నారప్ప తర్వాత ఈ సినిమాని వెంకటేష్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.

ఈ సినిమాలో ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ గా వెంకటేష్ కనిపిస్తాడని తెలుస్తుంది.తరుణ్ భాస్కర్ తనకి బాగా అలవాటైన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని తీసుకొని దానికి వెంకటేష్ లాంటి పిల్లర్ ని పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది.

మొదటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసి రెండో సినిమాతో ఏవరేజ్ అనిపించుకున్న తరుణ్ ఈ సారి వెంకటేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడు అనేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube