మరి ‘ఎఫ్‌ 3’ పరిస్థితి ఏంటీ వెంకీ?  

Venkatesh Next Sekhar Kammula - Telugu Anil Ravipudi, F3 Movie, F3 Movie Again Postponed, Love Story, Narappa, Sekhar Kammula, Venkatesh

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ‘నారప్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది.

 Venkatesh Next Sekhar Kammula

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్‌ ఆపేశారు.సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుండి నారప్ప చిత్రంను పున: ప్రారంభించాలని భావిస్తున్నారు.ఈ ఏడాది చివరి వరకు నారప్ప పూర్తి అవుతుందో లేదో తెలియదు.ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు వెంకీ గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చాడు.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న లవ్‌ స్టోరీ చిత్రం చివరి దశకు చేరింది.ఆ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఏషియన్‌ సునీల్‌ నిర్మాణంలో శేఖర్‌ కమ్ముల సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.

మరి ‘ఎఫ్‌ 3’ పరిస్థితి ఏంటీ వెంకీ-Movie-Telugu Tollywood Photo Image

ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది అంటూ శేఖర్‌ కమ్ముల ప్రకటించాడు.వెంకీ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడంటూ ఏషియన్‌ మూవీస్‌ నుండి క్లారిటీ వచ్చింది.

వచ్చే ఏడాదిలో శేఖర్‌ కమ్ముల వెంకీ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.ఇలాంటి సమయంలో ఎఫ్‌ 3 గురించిన చర్చ మొదలైంది.

ఎఫ్‌ 2 చిత్రంకు సీక్వెల్‌గా అనీల్‌ రావిపూడి ఎఫ్‌ 3 ని ప్రకటించాడు.ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయ్యింది.భారీ అంచనాల నడుమ ఎఫ్‌ 3 ని దిల్‌రాజు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించాడు.ప్రస్తుతం వెంకీ మరియు వరుణ్‌ లు చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే ఎఫ్‌ 3 ని మొదలు పెట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో వెంకీ, శేఖర్‌ కమ్ముల మూవీ ప్రకటన రావడంతో ఎఫ్‌ 3 పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test