వెంకటేష్-మారుతి ల సినిమా ప్రారంభం

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో “సితార ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది.ఎస్.

 Venkatesh New Film Launched Today-TeluguStop.com

రాధాకృష్ణ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.మరో ప్రముఖ నిర్మాత మరియు వెంకటేష్ సోదరులు సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేసారు.

మొదటి షాట్ కు ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ… “వెంకటేష్ గారు హీరోగా మారుతిగారి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించే అవకాశం లభించదం సంతోషకరం.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార నటించనున్నారు.“ఉత్తమ విలన్, చీకటి రాజ్యం” వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకుర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి స్వర సారధ్యం వహిస్తున్నారు.ఇప్పటికే మూడు అద్భుతమైన బాణీలు సమకూరాయి.అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కించనున్నారు.రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని 2016 ప్రధమార్ధంలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం” అన్నారు.

బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పృధ్వి, మురళీశర్మ, దేవ్ గిల్, జయప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: SB.ఉద్దవ్, కళ: రమణ వంక, చాయాగ్రహణం: వివేక్ ఆనంద్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: మారుతి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube