వెంకీతో ఆటాడిస్తానంటోన్న డైరెక్టర్

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ చిత్రం అసురన్ రీమేక్‌లో నటిస్తు్న్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ‘నారప్ప’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

 Venkatesh Tharun Bhascker Movie To Be Sports Drama, Venkatesh, Narappa, Srikanth-TeluguStop.com

ఈ సినిమాలో వెంకీ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

తమిళంలో ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు తెలుగులో నారప్ప ఎలా ఉంటుందా అనే ఆతృతగా అందరిలో నెలకొంది.

కాగా ఈ సినిమా తరువాత వెంకటేష్, తన నెక్ట్స్ మూవీని పెళ్లిచూపులు ఫేం డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.అప్పట్లో వెంకీకి ఓ స్టోరీ లైన్ వినిపించగా, దాన్ని పూర్తి చేయాల్సిందిగా ఆయన తరుణ్ భాస్కర్‌ను కోరాడట.

దీంతో తరుణ్ ఇప్పటివరకు అదే పనిలో ఉన్నాడని, ఇప్పుడు కథను పూర్తిగా రెడీ చేశాడట.

ఇక ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో వెంకీ గురు లాంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మళ్లీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుండటంతో వెంకీ ఈసారి ఎలాంటి గేమ్ ఆడుతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube