'నారప్ప' తేదీ ఫిక్స్‌.. ఇక దృశ్యం 2 ఎప్పుడో?

వెంకటేష్‌ హీరోగా రూపొందిన నారప్ప సినిమా ను ప్రైమ్ వీడియోకు అమ్మేశారు.ఈ సినిమా ను గత ఏడాది నుండి థియేటర్‌ రిలీజ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

 Venkatesh Narappa Movie Amazon Prime Video Release Date , Amazon Prime, Drushyam-TeluguStop.com

కాని కరోనా కారణంగా సినిమాను వాయిదా వేశారు.ఎట్టకేలకు ఈ సినిమాను ప్రైమ్‌ వీడియో లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

తమిళ సూపర్‌ హిట్‌ మూవీ కి ఇది రీమేక్.ధనుష్‌ పోషించిన పాత్రలో వెంకీ నటించాడు.

ఈ సినిమా కు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించాడు.సురేష్‌ బాబు నిర్మించగా తమిళ దర్శకుడు కళై పులి ఎస్‌ థాను సమర్పిస్తున్నాడు.

ఈ సినిమా కు పెట్టిన బడ్జెట్‌ కంటే అధనంగా అమెజాన్‌ వారు ఇచ్చేందుకు ముందుకు రావడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అమెజాన్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ ఎప్పుడా అంటూ ఎంతో ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు అమెజాన్‌ ప్రైమ్‌ లో నారప్ప విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.నారప్పను అమెజాన్‌ లో ఈనెల 20న స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఈ సినిమా లో వెంకీ లుక్‌ సినిమా కు ప్రధాన ఆకర్షణ.ఇక ఈ సినిమా లో ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతుంది.

భారీ అంచనాలున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారంటూ వార్తలు వస్తున్నాయి.

అమెజాన్‌ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ కోసం అభిమానులు ఎంతో కాలంగా వెయిట్‌ చేస్తున్నారు.వెంకీ అభిమానులకు ఈనెల 20వ తారీకు పండగే అంటూ మేకర్స్‌ చెబుతున్నారు.ఈ సినిమా కు సంబంధించిన స్ట్రీమింగ్‌ తేదీ ప్రకటించడంతో హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న దృశ్యం 2 ఎప్పుడు అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నాఉ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube