'నారప్ప' ఫస్ట్ కాపీ రెడీ.. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ !

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.వెంకటేష్ వరస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కు పోటీగా నిలుస్తున్నాడు.

 Venkatesh Narappa Movie Crazy Update-TeluguStop.com

కుర్ర హీరోలు కూడా హిట్ కొట్టడానికి తడబడుతుంటే వెంకీ మామ మాత్రం చెప్పుకో దగ్గ హిట్స్ తో దూసుకు పోతున్నాడు.అటు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూనే ఇటు సోలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం వెంకటేష్ మూడు సినిమాల ను లైన్లో పెట్టాడు.ఈ సినిమాల షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Venkatesh Narappa Movie Crazy Update-నారప్ప’ ఫస్ట్ కాపీ రెడీ.. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో నారప్ప సినిమా కూడా ఒకటి.ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 74 వ సినిమాగా తెరకెక్కింది.అసురన్ సినిమా రీమేక్ గా నారప్ప తెరకెక్కుతుంది.శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది.కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

మే 14 న విడుదల అవ్వబోతుందని ప్రకటించినప్పటికీ మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ వాయిదా వేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది.దగ్గుబాటి సురేష్ బాబు మరియు కళైపులి సంయుక్తం గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా కు మణిశర్మ సంగీతం అందించాడు.

ఈ సినిమాలో వెంకటేష్ మాస్ గెటప్ లో కనిపించనున్నాడు.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ తో అంచనాలు పెరిగాయి.

ఇప్పుడు కరోనా తగ్గడంతో మళ్ళీ ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

Telugu Asuran, Drushyam, F3 Movie, First Copy, Narappa, Priyamani, Release Date, Venkatesh, Venkatesh Narappa Movie Crazy Update-Movie

ప్రస్తుతం నారప్ప ఫస్ట్ కాపీ ను రెడీ చేస్తున్నారట.మరొక వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుందట.త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

వెంకటేష్ ఈ సినిమాతో పాటు F3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు.దృశ్యం 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.

మరొక సినిమా F3 షూటింగ్ దశలో ఉంది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

#Priyamani #Asuran #Drushyam #Venkatesh #Release Date

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు