అరడజను ప్రాజెక్ట్‌లతో సీనియర్‌ హీరో ఫుల్‌ బిజీ

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోలైనా సూపర్‌ స్టార్‌ హీరోలైనా కూడా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు.అది కూడా ఒక సమయంలో ఒక్కటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు.

 Venkatesh Full Busy With Six Movies, Venkatesh, Asuran, Tarun Baskar, Narappa, A-TeluguStop.com

ఒక సినిమా పూర్తి అయ్యి విడుదలైన తర్వాత రెండవ సినిమా గురించి మాట్లాడుతున్నారు.కాని సీనియర్‌ స్టార్‌ హీరో అయిన వెంకటేష్‌ మాత్రం ప్రస్తుతం ఆరు సినిమాలకు కమిట్‌ అయ్యారు.

అంతా సవ్యంగా సాగి ఉంటే ఈ ఏడాది వెంకటేష్‌ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.

ప్రస్తుతం తమిళ హిట్‌ మూవీ ‘అసురన్‌’ రీమేక్‌ అయిన నారప్ప చిత్రంలో వెంకీ నటిస్తున్నాడు.

నారప్ప సగానికి పూగా పూర్తి అయ్యింది.ఇక అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌ 2 కు సీక్వెల్‌ అయిన ఎఫ్‌ 3 కి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ఇటీవలే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్‌ సునీల్‌ నిర్మాణంలో వెంకటేష్‌ మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ మూడు సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.

Telugu Anil Ravipudi, Asian Sunil, Asuran, Ppa, Shekhar Kammula, Tarun Baskar, V

ఆ మూడు సినిమాలు కూడా దాదాపుగా కన్ఫర్మ్‌ అంటున్నారు.చాలా రోజులుగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వెంకీ మూవీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ త్వరలో అంటున్నారు.ఇక మలయాళంలో హిట్‌ అయిన అయ్యప్పన్‌ కోషియమ్‌ సినిమా రీమేక్‌ కు కూడా రానాతో కలిసి ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో వెంకీ నటించిన దృశ్యం చిత్రంకు మలయాళంలో సీక్వెల్‌ రూపొందుతుంది.అక్కడ మినిమంగా ఆడినా కూడా దాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని వెంకీ భావిస్తున్నాడు.ఇలా మొత్తం ఆరు ప్రాజెక్ట్‌లతో రాబోయే రెండు సంవత్సరాల వరకు వెంకీ మామ బిజీ బిజీగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube