వెంకటేష్‌ 'నారప్ప' ఉన్నట్లా? లేనట్లా?

తమిళ సూపర్‌ హిట్‌ మూవీ అసురన్‌ ను తెలుగులో నారప్ప అనే టైటిల్‌ తో రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే.సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి దాదాపు రెండు నెలలు అవుతుంది.

 Venkatesh Narappa And Drushyam 2 Movie Release Dates Update , Venkatesh , Narapp-TeluguStop.com

సినిమా ను మే 14వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించారు.కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నారప్ప సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

ఆచార్య సినిమా విడుదల తేదీకి నారప్ప విడుదల తేదీకి ఒక్క రోజు మాత్రమే తేడా ఉంది.కనుక ఆచార్య ముందు నారప్ప తేలిపోవడం ఖాయం అని అందుకే పోటీ పడటం ఎందుకు అనే ఉద్దేశ్యంతో నారప్ప సినిమా ను వాయిదా వేసే విషయమై మేకర్స్‌ ఆలోచనలో పడ్డారు.

సురేష్‌ బాబు తన సినిమా ల విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.అలాంటిది ఆచార్య వంటి పెద్ద సినిమా కు పోటీగా ఎలా నారప్పను విడుదల చేస్తారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

నారప్ప సినిమా విడుదల వాయిదా పడుతుండటం వల్లే ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు అంటున్నారు.నారప్ప విషయంలో మేకర్స్ కు చాలా నమ్మకం ఉంది.

అందుకు మంచి సమయంలో సినిమా ను విడుదల చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమా కంటే ముందు దృశ్యం 2 వచ్చే అవకాశం ఉందంటున్నారు.

దృశ్యం 2 సినిమా చాలా అంచనాల నడుమ రాబోతుంది.నారప్ప కంటే ముందు దృశ్యం 2 విడుదల చేయడం వల్ల అన్ని విధాలుగా బెటర్‌ అనే ఉద్దేశ్యంతో నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమా విషయంలో వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దృశ్యం విడుదలైన నెల రెండు నెలల గ్యాప్‌ లోనే నారప్ప విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.ఈ రెండు సినిమాల కోసం దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Aacharya, Acharya Ppa, Chiranjeevi, Drushyam, Ppa, Dates, Venkatesh-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube