వెంకటేష్, నాగార్జున.తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు టాప్ హీరోలు.
ఎన్నో చక్కటి సినిమాలు చేసి అద్భుత విజయాలను అందుకున్నారు.వీరిద్దరు నటించిన పలు సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.
పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్లను సాధించాయి.వీరిద్దరికి సినిమా బంధమే కాదు.
నిజ జీవితంలోనూ బంధుత్వాలు ఉన్నాయి.వెంకటేష్ సోదరిని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు.
ఆమెకు కలిగిన సంతానమే నాగ చైత్యన.కొంతకాలం తర్వాత వీరు విడిపోవడంతో నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నాడు.
వీరిద్దరి వ్యక్తిగత విషయాలను కాసేపు పక్కకి పెడితే.సినిమాల గురించి మాట్లాడుకుందాం.
టాలీవుడ్ కింగ్ నాగార్జున.విక్టరీ వెంకటేశ్ త్వరలో క్రేజీ సినిమాలో ముందుకు రాబోతున్నారు.గతంలో విడుదలై మంచి హిట్ కొట్టిన సినిమాలకు సీక్వెల్స్ తీసి జనాలను అలరించబోతున్నారు.2014లో వెంకటేష్ హీరోగా, మీనా హీరోయిన్ గా చేసిన సినిమా దృశ్యం.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా విజయంతో తాజాగా దానికి సీక్వెల్ రూపొందించారు.
అదే దృశ్యం-2.ఈ సినిమా త్వరలో జనం ముందుకు రాబోతుంది.
అటు 2016లో నాగార్జున హీరోగా, రమ్యక్రిష్ణ, లావణ్యా త్రిపాఠి కీలకపాత్రలు పోషించిన సోగ్గాడే చిన్ని నాయనా కూడా చక్కటి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా రూపొందింది.
ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ రెండు సినిమాల్లో తమ ఎవర్ గ్రీన్ హిట్ ఫెయిర్ తో నాగార్జున, వెంకటేష్ జత కట్టడం విశేషం.
సంకీర్తన సినిమా మొదలుకొని సోగ్గాడే చిన్ని నాయనా వరకు నాగార్జునతో కలిసి నటించింది రమ్యక్రిష్ణ.ఆ తర్వాత ప్రస్తుత సీక్వెల్ మూవీ బంగార్రాజులోనూ నాగ్ తో జోడీ కడుతుంది.అటు చంటి నుంచి దృశ్యం వరకు వెంకీతో కలిసి నటించింది మీన.ప్రస్తుత సీక్వెల్ మూవీ దృశ్యం-2 లోనూ నటిస్తోంది.మొత్తంగా ఈ సీక్వెల్ మూవీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.