టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘నారప్ప’ కూడా ఒకటి.విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో చిత్ర వర్గాల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇప్పటికే విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది.
కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నిస్తున్నాడు.ఇప్పటికే అనంతపురంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.
అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.కానీ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో నారప్ప షూటింగ్‌ను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ క్రమంలోనే ఏ సీక్వెన్స్‌లను ముందుగా షూట్ చేయాలా అనే అంశంపై చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమాలో వెంకటేష్ చాలా వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తున్నాడు.ఇక వెంకీ సరసన ఈ సినిమాలో ప్రియమణి నటిస్తోండగా, పలువురు కీలక నటీనటులు ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించబోతున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి అనుకున్న విధంగానే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టి, సంక్రాంతి నాటికి రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.
నారప్ప చిత్రంతో వెంకీ అదిరిపోయే సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.