మిస్ వరల్డ్‌ను మిస్ చేసుకున్న వెంకటేష్

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లను చిత్రసీమకు పరిచయం చేశాడు.గతంలో ఆయనతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఇప్పుడు స్టార్ బ్యూటీలుగా ఇండస్ట్రీలో ఉన్నారు.

 Venkatesh, Preminchukundam Raa, Anjala Jhaveri, Aishwarya Rai, Suresh Production-TeluguStop.com

అయితే వెంకీ ఒక సందర్భంలో మిస్ వరల్డ్‌తో సినిమా చేయాల్సిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

వెంకీ కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచి, ఆయన హిట్ చిత్రాల లిస్టులో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం ప్రేమించుకుందాం రా. ఈ సినిమా అప్పట్లో యూత్‌ను ఏ విధంగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమా రొమాంటిక్ చిత్రాలకు సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమాలో వెంకీ సరసన అంజలా జవేరీ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.అయితే ఈ సినిమాలో తొలుత ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించారట.

కానీ ఆ సమయంలో ఆమె ఫాంలో లేకపోవడంతో చిత్ర యూనిట్ ఆమెను పక్కనబెట్టారట.దీంతో ఆ అవకాశం అంజలా జవేరీకి దక్కడంతో ఆమె ఆ సినిమాలో నటించింది.

ఇక ఆ సినిమా తరువాత వరుసగ స్టార్ హీరోల పక్కన నటించింది ఈ బ్యూటీ.మొత్తానికి మిస్ వరల్డ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వెంకీ మామ మిస్ చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube