ఓటీటీ ఫిల్మ్ కోసం కోసం వెంకటేష్ మహాతో జత కట్టిన విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కెరియర్ లో డిఫరెంట్ జోనర్ కథలతో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.ప్రస్తుతం అతను చేతున్న దృశ్యం2, నారప్ప కథలు రీమేక్ లే అయినా కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా కాన్సెప్ట్ బేస్ నడిచే కథలుగా తెరకెక్కుటున్నాయి.

 Venkatesh Maha Movie With Venkatesh, Drushyam 2 Movie, Narappa Movie, Amazon Pri-TeluguStop.com

మరో వైపు అని రావిపూడితో ఎఫ్3 మూవీ ద్వారా పూర్తి స్థాయిలో నవ్వులు పంచె ప్రయత్నం చేస్తున్నాడు.ఇక తన వయస్సుకి తగ్గ పాత్రలని ఎంపిక చేసుకుంటూ వెంకటేష్, నాగార్జున కొత్త దర్హ్స్కులు, కొత్త కథలకి వెల్ కమ్ చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో మంచి కథ అయితే ఒటీటీ ఫిలిం, వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి వీరిద్దరు సిద్ధంగా ఉన్నారు.అయితే కింగ్ నాగార్జున కంటే ముందుగా వెంకటేష్ ఒటీటీ ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్యః మూవీలతో వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు మూడో సినిమాని తనకి మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాత ప్రవీణ పరిచూరితోనే చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీని ఎనౌన్స్ చేసేశారు.

కంప్లీట్ గా యూస్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.మరో వైపు సురేష్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఇప్పటికే సైన్ చేశాడు.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఏకంగా విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్లు తెలుస్తుంది.అది కూడా ఒటీటీ కోసమే ప్రత్యేకంగా ఈ మూవీని సిద్ధం చేస్తున్నట్లు బోగట్ట.

ఒటీటీ ఆడియన్స్ కి సరిపోయే కథాంశంని రీసెంట్ గా వెంకటేష్ మహా విక్టరీ వెంకటేష్ కి వినిపించడం జరిగిందని, అతని కూడా నచ్చడంతో ఒకే చెప్పారని తెలుస్తుంది.ఈ సినిమా నిర్మాణంలో అమెజాన్ ప్రైమ్ కూడా భాగస్వామ్యం అవుతుందని, సురేష్ ప్రొడక్షన్ తో కలిసి మొదటి సారి నిర్మాణ భాగస్వామిగా అమెజాన్ ప్రైమ్ మారుతుందని తెలుస్తుంది.

త్వరలో ఈ మూవీకి సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube