అయ్యో వెంకటేష్ సినిమాని ఆపేశారట   Venkatesh – Kishore Tirumala Project Cancelled ?     2016-12-20   04:26:46  IST  Raghu V

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం “గురు” అనే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజిగా ఉన్నారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాలివుడ్ లో వచ్చిన సాలా ఖడూస్ చిత్రానికి రీమేక్. అయితే అక్కడా ఇక్కడా, దర్శకురాలు సుధనే కావడం విశేషం. గురు జనవరి చివర్లో విడుదల కానుంది.

ఈ సినిమా సంగతి ఇలా ఉంటే, నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఆడవాళ్ళు మీకు జోహార్లు” అనే టైటిల్ కన్ఫర్మ్ అయిన ఈ సినిమాలో నిత్య మీనన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

ప్రీ పోడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఆపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న క్యాష్ క్రంచ్ పరిస్థితులల్లో ఈ సినిమాని నిర్మించడం నిర్మాత రామ్ మోహన్ ని కష్టంగా అనిపిస్తోందని, అందుకే ఈ ప్రాజెక్టుని క్యాన్సల్ చేస్తున్నారని టాక్.

అయితే ఈ కారణంతో ఈ సినిమా పూర్తిగా ఆగిపోతుందా లేక నిర్మాత మారతాడా చూడాలి!