తమిళంలో సినిమా చేయబోతున్న విక్టరీ వెంకటేష్

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ మధ్య కాలంలో సోలో సినిమాలు కంటే కాంబినేషన్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు.సోలో సినిమా అయితే తన వయసుకి తగ్గ పాత్రలతో హీరోయిజం ఎలివేట్ చేసే విధంగా ఉన్నవి మాత్రమే ఒప్పుకుంటున్నాడు.

 Venkatesh Green Signal To Tamil Movie, Tollywood, Kollywood, South Cinema, India-TeluguStop.com

అందులో భాగంగానే నారప్ప సినిమా చేస్తున్నాడు.ఇందులో వయసు మళ్ళిన తండ్రి పాత్రలో వెంకటేష్ కనిపిస్తాడు.

ఇదిలా ఉంటే ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ మల్టీ స్టారర్ సినిమాలు కూడా వెంకటేష్ ఎక్కువగా చేస్తున్నాడు.మరో వైపు తాజాగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెంకటేష్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా పూర్తిగా తమిళంలోనే తెరకేక్కుతుందని టాక్ నడుస్తుంది.

ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ లలో ఉన్న మురగదాస్ వెంకటేష్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడని సమాచారం.

వెంకటేష్ కి ఇప్పటికే ఒక కథను వినిపించాడని అది పూర్తిగా తమిళంలో ఉంటుంది అని టాక్.ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో డబ్బింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఆయన గుడ్డి వాడి గా నటించే అవకాశం ఉంది అని టాక్.దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని, ఇప్పటికే కథను విన్నారని, కాని కొన్ని మార్పులు చేయడం దానిని తెలుగు కి తగిన విధంగా మార్చడంతో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube